37.2 C
Hyderabad
May 2, 2024 14: 21 PM
Slider నిజామాబాద్

బిచ్కుందలో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

bichkunda 281

బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగ విత్తనాల కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ ఎంపిపి అశోక్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ప్రభుత్వ మద్దతు ధర 4875 రూపాయలను ప్రభుత్వ ప్రకటించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరువురితో పాటు వ్యవసాయ శాఖ అధికారి పోచయ్య, వైస్ చైర్మన్ యాదవరావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్ పటేల్, సహకార సంఘం కార్యదర్శి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.

ఇంకా సర్పంచ్ శ్రీరేఖ రాజు, మాజీ జడ్పీటీసీ సాయిరాం, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, ఫతలాపూర్ సర్పంచ్ అరుణ్  కుమార్, తక్కడపల్లి సర్పంచ్ పుండలిక్, ఆయా గ్రామ రైతులు పాల్గొన్నారు.

Related posts

అమ్మా మల్లు స్వరాజ్యం నీ ఆశయాలను వమ్ము కానివ్వం

Satyam NEWS

విద్యారంగ సమస్యలు ప్రభుత్వం పరిష్కారం చేయాలి

Satyam NEWS

కలలు సాకారం ఐయ్యేందుకు ఆత్మవిశ్వాసమే కీలకం

Satyam NEWS

Leave a Comment