38.2 C
Hyderabad
April 29, 2024 11: 52 AM
Slider వరంగల్

ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి

#teachers

ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు వెంటనే చేపట్టాలని టిఆర్టిఎఫ్ రాష్ట్ర చీప్ పాట్రన్ లక్కిరెడ్డి సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టిఆర్టిఎఫ్) హన్మకొండ, వరంగల్, ములుగు జిల్లా శాఖల సమావేశం టిఆర్టిఎఫ్ స్టేట్ చీఫ్ పాట్రన్ లక్కిరెడ్డి సంజీవరెడ్డి అధ్యక్షతన ఆదివారం పిఎస్ సుబేదారి పాఠశాలలో నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఏపి,టిఎస్ ఉమ్మడి రాష్ట్రాల కో- కన్వీనర్ దాక్ష్యపు విష్ణుమూర్తి హజరయ్యారు.

ఈ సమావేశంలో ములుగు జిల్లా శాఖకు నూతనంగా అధ్యక్షులుగా జున్ను అనిల్ కుమార్ ను, ప్రధాన కార్యదర్శిగా అజ్మీర రాజు నాయక్ లను, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పి శివరాం, కె రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సమావేశంలో సభాధ్యక్షులు లక్కిరెడ్డి సంజీవరెడ్డి మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా ప్రమోషన్స్ లేక, 3 సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్స్ లేక ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు.

వెంటనే ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ షెడ్యూల్ ను ప్రకటించాలని,నిలిచిపోయిన 3 డిఏలను వెంటనే విడుదల చేయాలని, ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకొనే ఈ ప్రభుత్వం హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకోవాలని కోరారు. ముఖ్య అతిధి దాక్ష్యపు విష్ణు మూర్తి మాట్లాడుతూ 317 జీవో వల్ల బలవంతంగా జరిగిన బదిలీలలో నష్ట పోయిన వారికి తగు న్యాయం చేయాలని, విద్యాశాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ శక్తి వంచన లేకుండా శ్రమించి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బాసికి రాజ బాపురావు, శ్రీపతి కృష్ణ మూర్తి, వడ్డె కిషన్, మాడిశెట్టి శ్రీనివాస్, రాంచంద్రం సింహజి, కె. రవీందర్, ఏ. శ్రీనివాస్, జి సదానందం, పి.శివరాం, బి రాజేష్, ఈ రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ట్రాజెడీ: కోడి కత్తి గుచ్చుకుని ఒకరి మృతి

Satyam NEWS

ధాన్యం రైతుల మహాధర్నా: మూడు గంటల పాటు ఆందోళన

Satyam NEWS

దళిత బంధు లబ్ధిదారులకు ఆదాయం రెట్టింపు అయ్యేలా చూడాలి

Satyam NEWS

Leave a Comment