37.2 C
Hyderabad
May 6, 2024 19: 10 PM
Slider విజయనగరం

యువతా…డ్రగ్స్ కు ఎడిక్ట్ అవ్వొద్దు…!

#International Anti-Narcotics Day

“అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం” సందర్భంగా విజయనగరంలో జిల్లా పోలీసు శాఖ విద్యార్ధులతో ర్యాలీ
నిర్వహించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ యువతకు మత్తు పదార్థాల వినియోగంకు దూరంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా విజయనగరం 1వ, 2వ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో విజయనగరం ఆర్టీసి కాంప్లెక్సు నుండి ఎత్తు బ్రిడ్జి వరకు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు, యువతకు మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలు పట్ల అవగాహన కల్పించారు. ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ ఎం.దీపిక ముఖ్య అతిధిగా హాజరై, ర్యాలీని ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు.అనంతరం జిల్లా ఎస్పీ ఎం.

దీపిక మాట్లాడుతూ – మత్తు పదార్థాల వినియోగంకు యువత దూరంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. మత్తు పదార్థాల విక్రయం, రవాణ, వినియోగించే వారి సమాచారాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 14500కు లేదా కమాండ్ కంట్రోలు అందించాలన్నారు.

చెడు సహవాసాలతో, వ్యసనాలకు యువత బానిసై లక్ష్యంకు దూరం కావద్దన్నారు. మత్తు పదార్థాలకు అలవాటుపడే యువత శారీరక రుగ్మతలకులోనై, జ్ఞాపకశక్తి కోల్పోయి, విచక్షణ, విజ్ఞత కోల్పోయి, నేరాలకు పాల్పడుతూ, దురదృష్టవసాత్తు కేసుల్లో నిందితులుగా మారుతూ, తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు.

జిల్లాను మాదక ద్రవ్యరహితంగా మార్చేందుకు, యువతకు మాదక ద్రవ్యాలకు దూరం చేసేందుకు, విద్యా సంస్థలు, ముఖ్య కూడళ్ళులో హెూర్డింగులను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసామన్నారు. మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలను విద్యార్థులు, ప్రజలు, యువతకు వివరిస్తూ, స్థానిక పోలీసులు, మహిళా సంరక్షణ పోలీసుల సహాయంతో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక అన్నారు.

విజయనగరం పట్టణం ఆర్టీసి కాంప్లెక్స్ నుండి ఎత్తు బ్రిడ్జి వరకు ర్యాలీగా వెళ్ళి, మానవ హారంగా ఏర్పడి, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేసారు. ఈ ర్యాలీలో విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు, వన్ టౌన్ సీఐ డా. బి. వెంకటరావు, టూటౌన్ సీఐ సిహెచ్.లక్ష్మణరావు, ఎస్బీ సీఐ జి. రాంబాబు, ఎస్ఐలు భాస్కరరావు, రామగణేష్, ట్రాఫిక్ ఎస్ఐలు మహేశ్వర రాజు, త్రినాధరావు, వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్సిసి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

రైతుల పంట రుణాలను రద్దు చేయాలి

Satyam NEWS

ఇండ్ల స్థలాలు కోసం 19న ధర్నా

Bhavani

ఈటల రాజేందర్ కు నిరసనల సెగ

Satyam NEWS

Leave a Comment