31.7 C
Hyderabad
May 2, 2024 07: 06 AM
Slider ముఖ్యంశాలు

అనాథ శవాల ఆత్మబంధువుకు అరుదైన గౌరవం

#Baji Shaik

అనాధ శవాలను కూడా తన వారిగా భావించిన హుజూర్ నగర్ కి చెందిన ‘బాజి’కి యూత్ ఐకాన్ అవార్డు వరించింది. సూర్యాపేట హుజూర్ నగర్ కు పట్టణానికి చెందిన ‘బాజి’ ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తి. వృత్తిరీత్యా డ్రైవర్.

 తన మనసులో ఏమనుకున్నాడో ఏమో పిన్న వయసు నుండి తాను సంపాదించిన దానిలో కొంత భాగం పేదల సేవకే ఖర్చుచేస్తూ ‘బ్రతుకు-బ్రతికించు’ సంస్థను నెలకొల్పి సొంత ఊరిలోనే కాకుండా తమ సొంత డబ్బులతో మన రాష్ట్రం లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఏ దిక్కు లేకుండా చనిపోయిన సుమారు 500 మంది అనాధ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించారు.

ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన “బ్రతుకు బ్రతికించు”సంస్థ మెంబర్. బాజి కి అమెరికన్ క్యాన్సర్ సోసైటీ వారు యూత్ ఐకాన్ అవార్డుని ఢిల్లీలో ఉన్న గురు ఆర్గోనైజన్ వారిచేత జూన్ నెలలో అందజేయనున్నారు. పలువురు బాజీ చేస్తున్న సేవలకు అభినందిస్తున్నారు.

Related posts

రూ.5 లక్షలు వసూలు చేసిన కేసులో విలేకరి పై కేసు

Satyam NEWS

వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాలకృకష్ణ

Satyam NEWS

రేషన్ కార్డు లేని వలస కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment