Slider ప్రత్యేకం

రూ.5 లక్షలు వసూలు చేసిన కేసులో విలేకరి పై కేసు

Shriya-Saran-Wallpapers-photos

హీరోయిన్ శ్రేయా ను రియాల్టీ షో జడ్జి గా తెస్తానని నమ్మించి మోసం చేశాడో ప్రముఖ దినపత్రిక విలేకరి. శ్రేయా ను జడ్జిగా తీసుకువస్తానని చెప్పి తన వద్ద నుంచి ఆ రిపోర్టర్ రూ.5 లక్షలు వసూలు చేశాడని షో దర్శకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఐదు రోజుల కిందట జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాక్షి పత్రిక విలేకరి చైతన్య. అతనితో పాటు లక్ష్మి సింధుజ అనే మహిళ కూడా ఈ మోసంలో పాలుపంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరిపై  420,406 సెక్షన్ల కింద బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related posts

శానిటేష‌న్ సిబ్బందిపై విజయనగరం మునిసిపల్ క‌మీష‌న‌ర్ ఆగ్ర‌హం

Satyam NEWS

తిరుమల భక్తులపై భారం వేయడం తగదు

mamatha

పాజిటివ్ టైటిల్ తో వస్తున్న “బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌’ చిత్రం

mamatha

Leave a Comment