27.7 C
Hyderabad
May 12, 2024 06: 04 AM
Slider గుంటూరు

భూ సేకరణలో అధిక ధర కొట్టేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు

#navataramparty

భూ సేకరణలో అధికార పార్టీ వారికి ఒక రకంగా, బలహీన వర్గాలకు చెందిన వారికి మరొక రకంగా పరిహారం చెల్లించడంపై నవతరం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట బైపాస్ రోడ్డు కోసం వ్యవసాయ బాబులను సేకరించాల్సి వచ్చింది. అనేక మంది రైతుల వ్యవసాయబావులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెందిన వ్యవసాయ బావులకు భారీ పరిహారం చెల్లించగా బలహీన వర్గాలకు చెందిన వారి బావులకు మాత్రం అతి తక్కువ పరిహారం చెల్లించారు.

దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం నరసరావుపేట ఆర్డీవో శేషిరెడ్డికి నేడు ఫిర్యాదు అందించారు. వడ్డెర, ముస్లిం, ఎస్సి సామాజిక వర్గానికి చెందిన వారి నీటి బావులకు చిలకలూరిపేట ఎంపిపి దేవినేని శంకర్రావు ఆదేశాల మేరకు తక్కువగా నష్టపరిహారం చెల్లించాలని అధికారులు సిఫార్సు చేసిన విషయం ఆర్డీవో కి వివరించారు.

బావులకు వేరువేరు రకంగా ధరలు నిర్ణయం చేయడం పై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆర్డీవో శేషిరెడ్డి అధికారులు తో ఫోన్లో మాట్లాడారు. నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ఆదేశించారు. రైతులకు అండగా ఉంటామని నష్టం జరిగితే ఉద్యమం తప్పదని రావుసుబ్రహ్మణ్యం అధికారులను హెచ్చరించారు. బాధిత రైతుల బావుల వద్దకు ఫీల్డ్ విజిట్ కు రావాలని, అధికార ఎంపీపీ బావికి అధిక ధర నిర్ణయం చేసిన విషయం ఆధారాలతో సహా నిరూపిస్తామని బాధితులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాధిత రైతులతో బాటు నవతరంపార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ గోదా రమేష్ కుమార్,చిలకలూరిపేట అసెంబ్లీ కన్వీనర్ బత్తుల అనిల్,విద్యార్థి సంఘం నేత గుంజి అనిల్,బాధిత రైతులు బత్తుల వెంకట సుబ్బారావు, నందిగం యోహాను, బత్తుల కోటేశ్వరమ్మ, ఎస్కె జానీ బాషా,బత్తుల గురవమ్మ, బత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బోర్డులు పెట్టారు మరి ధాన్యం కొనుగోలు ఎప్పుడు?

Satyam NEWS

కడప జిల్లా వైసీపీకి బీటలు: తెలుగుదేశం వైపు చూస్తున్న నేతలు

Satyam NEWS

ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ నుండి స్వచ్ఛమైన గానుగనూనె

Satyam NEWS

Leave a Comment