37.2 C
Hyderabad
April 26, 2024 21: 42 PM
Slider శ్రీకాకుళం

బోర్డులు పెట్టారు మరి ధాన్యం కొనుగోలు ఎప్పుడు?

skl bjp

రైతుల కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, శ్రీకాకుళం రూరల్ మండలం బిజెపి అధ్యక్షుడు ఇప్పిలి సీతరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం రూరల్ గ్రామాలలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కల్లాల్లో నిల్వ చేసి అమ్మడం కోసం ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల బోర్డులు పెట్టి నెలలు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని అన్నారు.

రైతుల పక్షపాతి ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి, రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నారని, ప్రభుత్వం కొనడం లేదు మిల్లర్లని, ప్రైవేటు వ్యక్తులను కొననీయడం లేదని ఆరోపించారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ దిగుబడి వచ్చే 1001 వరి వద్దని చెప్పి, వేరే రకం వరి నాటించారని, ఖర్చు ఎక్కువ, దిగుబడి తక్కువతో రైతులు బాధపడుతుంటే, కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వాతావరణం భయపెడుతోందని, ఈ సారి రైతులు సంక్రాంతి పండుగ జరుపుకోలేని పరిస్థితి నెలకొందని, వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే రూరల్ గ్రామాలలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో, తాతల కాలం నుండి పేదల అనుభవంలో ఉన్న చిన్న చిన్న స్థలాలను స్వాధీనం చేసుకుమటున్నారని, మోతుబరి రైతులు వద్ద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమిత భూములను మాత్రం వదిలేస్తున్నారని ఆరోపించారు. వెంటనే పెద్ద రైతుల వద్ద ఉన్న అక్రమ భూములను స్వాధీనం చేసుకుని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పేదల దగ్గర లాక్కొని వేరే పేదలకివ్వడం సమంజసమా అని ప్రశ్నించారు. వెంటనే అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలని కోరారు. ఈ సమావేశంలో ఇప్పిలి సీతరాజుతో పాటు, అసెంబ్లీ ఇంఛార్జ్ చల్లా వెంకటేశ్వర రావు, కోరాడ నారాయణ రావు, మండల ప్రధాన కార్యదర్శి చిట్టి తౌడు, ఉపాధ్యక్షులు వాడాడ కృష్ణ మూర్తి, భైరి అప్పారావులు, పొన్నాడ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ, మానవహారం

Satyam NEWS

సవాయిగూడెం బిజెపి భరోసాలో రామన్న

Satyam NEWS

హామీ నిలబెట్టుకోలేని జగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు

Satyam NEWS

Leave a Comment