30.7 C
Hyderabad
May 5, 2024 03: 06 AM
Slider విజయనగరం

చంద్ర‌బాబు మ‌తి భ్ర‌మించి మాట్లాడుతున్నారు…!

#kolagatla

జేడ్పీ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీనివాస‌రావుతో పాటు విజ‌య‌న‌గ‌రం,నెల్లిమ‌ర్ల‌,రాజాం ఎమ్మెల్యే లు ఘాటు విమ‌ర్శలు

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఈ నెల 17 టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు ప‌ర్య‌ట‌న జ‌రిగింది.జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్నితూర్పార‌బెట్టారు. తాను  14 ఏళ్లు సీఎంగా ఉన్నాన‌ని…మూడేళ్లలో ఈ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏం చేసాడు అని.. ప్ర‌తీ ఒక్క‌రికి అప్పులు తెచ్చి మ‌రీ..నిధుల పేరుతో డ‌బ్బులు కుంభ‌రిస్తున్నార‌ని…దుమ్మెత్తి పోసారు.

సీన్ క‌ట్ చేస్తే…40 ఏళ్ల బాబు రాజ‌కీయంలో  జ‌ర‌గ‌ని అభివృద్ది ప‌నులు ఈ మూడేళ్ల‌లో జ‌ర‌గ‌డం..అదీ గాక‌..వృద్దాప్యం మీదకు రావ‌డంతో…అటు పార్టీని ఇటు కార్య‌క‌ర్త‌ల‌ను కాపాడుకోవ‌డం..కోసం మ‌తి భ్ర‌మించి పిచ్చి,పిచ్చిగా మాట్లాడుతున్నారంటూ…జేడ్పీ చైర్మ‌న్ మజ్జి శ్రీనివాస‌రావుతో స‌హా విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల  వీర‌భ‌ద్ర‌స్వామితో పాటు నెల్లిమ‌ర్ల‌,రాజాం ఎమ్మెల్యేలు సంయుక్తంగా మీడియా స‌మావేశం పెట్టిమ‌రీ  చంద్ర‌బాబు మాట‌ల‌ను తీవ్రంగా ఖండించారు.

విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిందని, అందుకే అసహనంతో చంద్రబాబు మాట్లాడుతున్నారని, రాబోయే ఎన్నికలలో ధైర్యముంటే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి బొత్స పై చంద్రబాబు పోటీ చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా పరిషత్  చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సవాల్ విసిరారు.ఈ మేర‌కు విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే… కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల‌తో పాటు జేడ్పీ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీనివాస‌రావుతో కలిసి మాట్లాడారు.

2019 వ  సంవత్సరంలో ఎన్నికలకు రెండు నెలల ముందు  ప్రభుత్వ వైద్య కళాశాలకు చంద్రబాబు జీవో ఇచ్చి ప్రజలను మభ్య పెట్టాని కానీ…సీఎం జ‌గ‌న్  హయాంలో ఈ ఏడాది నుంచే ప్రభుత్వ వైద్య కళాశాల తరగతులను ప్రారంభిస్తున్నామని జేడ్పీ చైర్మ‌న్ మజ్జి శ్రీనివాస‌రావు అన్నారు.. గిరిజన యూనివర్సిటీ తమ ప్రభుత్వం హయాంలోనే ప్రారంభమైందని…. చంద్రబాబు అబద్ధపు మాటలతో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తూ, పబ్బం  గడుపుతున్నారని  స్థానిక ఎమ్మెల్యే ,డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి అన్నారు. .

టిడిపి ప్రభుత్వంలో అశోక్ గజపతి రాజుకు, సుజయ కృష్ణా రంగారావుకు మంత్రి పదవులు ఇచ్చి ఇప్పుడు  చంద్ర‌బాబు సామాజిక న్యాయం గూర్చి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.. రాముడిని అడ్డుపెట్టుకుని కుటిల రాజకీయాలు చేయాలనుకునే చంద్రబాబు జిల్లాకు వచ్చారని అన్నారు.  రామతీర్థం లో జరిగిన అపచారానికి , తమ ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలతో ఆలయ నిర్మాణం చేపట్టి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా  చేసిందని అన్నారు. జిల్లాలో ఎంత‌మేర‌ అభివృద్ధి జరిగిందో తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియదని, అందుకే  ఆవిష‌యం చంద్రబాబుకు చెప్పలేకపోయారని అన్నారు.

గురజాడ యూనివర్సిటీనీ  కూడా తామే చేపడతామని చంద్రబాబు ఎన్నికలకు వెళ్ళాడు అని, తమ ప్రభుత్వ హయాంలోనే గురజాడ యూనివర్సిటీ ప్రారంభించామని… గిరిజన యూనివర్సిటీని కూడా తమ ప్రభుత్వ హయాంలోనే క్లాసులు ప్రారంభించడం జరిగిందన్నారు. . తోటపల్లి, రామతీర్థ సాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రజలను మభ్య పెట్టే మాటలు మాట్లాడారని,. రామతీర్థ సాగర్ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితులను విస్మరిస్తే, సీఎం జ‌గ‌న్ 70 కోట్ల నిధులు విడుదల చేసి నిర్వాసితులకు అండగా ఉన్నారని అన్నారు. 

దివంగత  సీఎం వైఎస్ఆర్  సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఏడు వేల కోట్ల రూపాయలతో పునాది వేస్తే, ఏడు వందల కోట్లకు కుదించిన  ఘనత చంద్రబాబు దేనని  విమ‌ర్శించారు. భోగాపురం విమానాశ్రయం విషయంలో సీఎం జ‌గ‌న్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని,. తొందరలోనే అది కూడా పూర్తి చేస్తామని అన్నారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ చంద్రబాబు డిప్రెషన్ లో ఉండి మాట్లాడుతున్నారని, ఈ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడ లేదన్నారు. .

వయస్సు  పైబడిన రాజకీయాలు వదలకుండా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నరని అన్నారు.సీఎం జ‌గ‌న్ కి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు.  కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిది పోయి చంద్రబాబు  హైదరాబాదులో ఉంటే, జిల్లాకు చెందిన అశోక్ గజపతి రాజు తన బంగ్లాకు తాళాలు వేసుకున్న సంగతి ప్రజలందరికీ తెలుసు అని అన్నారు..

నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఉత్తరాంధ్ర కు ఏమీ అభివృద్ధి చేశారో చెప్పాలని అన్నారు.  నారావారిపల్లెలో సారా  వ్యాపారం చేసిన చంద్రబాబు ఇంత పెద్ద వాడు ఎలా అయ్యాడు చెప్పాలని డిమాండ్ చేశారు. . రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ  రాష్ట్రంలో మ‌ళ్లీ 175 సీట్లు గెలిచి  సీఎంగా మ‌ళ్లీ  జ‌గ‌న్  తిరిగి అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు.

ఈ  మీడియా స‌మావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ పి.వి సూర్యనారాయణ రాజు (డాక్టర్ సురేష్), డీసీఎంఎస్ మాజీ అధ్యక్షులు  కె వి సూర్యనారాయణ రాజు, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు నడిపిన శ్రీనివాస రావు తదితరులు ఉన్నారు.

Related posts

జనానికి మందుపోసి సొమ్ము చేసుకుంటున్న జగన్

Satyam NEWS

ఈ దృశ్యం మారేదెన్నడు?

Satyam NEWS

నటుడిగా రాణించాలనుకుంటున్న మరో ఎన్నారై వెంకట్ దుగ్గిరెడ్డి

Satyam NEWS

Leave a Comment