కాక్ టైల్, రామ్ లీలా, చెన్నై ఎక్స్ ప్రెస్, బాజీరావ్ మస్తానీ, పికూ, పద్మావత్ లాంటి చిత్రాలతో తన ప్రతిభను నిరూపించుకుని ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిన దీపికా పదుకొనే మరో అద్భుతం చేయబోతున్నారు. మహాభారత్ చిత్రాన్ని ఆమె తన సన్నిహితులతో కలిసి నిర్మించబోతున్నారు. మహాభారత్ ను నిర్మించడమే కాదు అందులో ఆమె ద్రౌపది పాత్రను పోషిస్తున్నారు. దీపికా పదుకొనే చెప్పే మహాభారతం మొత్తం ద్రౌపది చుట్టూనే తిరుగుతుంది. ద్రౌపది మహాభారతం తో భారతీయ ప్రజలకు పరిచయం అయిన సూపర్ హీరోయిన్. అలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ ను పోషించేందుకు దీపికా పదుకొనే ముందుకు రావడం నిజంగా సాహసమే. దానికి తోడు ఆమే నిర్మాతగా మారడం కూడా మరో పెద్ద సాహసమే. దీపికా పదుకొనే ద్రౌపదిగా నటించే మహాభారత్ చిత్రం రెండు కన్నా ఎక్కువ భాగాలుగా ఉంటుంది. తొలి భాగం 2021 దీపావళికి విడుదల అవుతుంది. ఆ తర్వాతి సంవత్సరం మరో భాగం విడుదల అయ్యే అవకాశం ఉంది. ద్రౌపది ఎవరు అనే విషయం అనౌన్స్ చేశారు కానీ దర్శకుడు ఎవరు? మిగిలిన క్యారెక్టర్స్ ఎవరు ప్లే చేస్తున్నారు అనే విషయం మాత్రం చెప్పలేదు.
previous post