ఫేస్ బుక్ లో ఒక పేజి ఉంది. దాని పేరు వైఎస్ఆర్ సిపి ఫోరం. ఆ ఫేస్ బుక్ పేజి నిండా ఏపి సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలసీలను పొగుడుతూ పోస్టులు ఉంటాయి. ఈ ఫేస్ బుక్ పేజి ఇటీవల ఒక పోల్ నిర్వహించింది. పార్టీలకు అతీతంగా మీ అభిప్రాయాలను వెల్లడించండి. మన రాజధాని అమరావతి అయితే బాగుంటుందా…విశాఖపట్నం అయితే బాగుంటుందా… అందరూ పాల్గొనాలని మనవి.
అని ఓటింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్ లో మొత్తం 11 లక్షల 38 వేల మంది ఓట్లు వేశారు. 11 వందల కామెంట్లు 2900 షేర్లు వచ్చాయి. అంతా బాగానే ఉంది కదా? మరింకేంటి? అంతా బాగానే ఉంది కదా? మరి అసలు విషయం ఇక్కడే ఉంది. ఈ పోల్ లో 77 శాతం మంది అమరావతిలో రాజధాని ఉండాలని ఓటేశారు. విశాఖ పట్నంలో రాజధాని ఉండాలని కేవలం 23 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. అయ్యా అదీ కథ. ఇంకా చెప్పాలా?