29.7 C
Hyderabad
May 1, 2024 06: 09 AM
Slider సంపాదకీయం

కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం?

#YS Sharmila

తెలంగాణ లో ఎంతో ఆర్భాటంగా రాజకీయ పార్టీ ప్రారంభించిన వై ఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధపడుతున్నారు. గత కొద్ది రోజులుగా షర్మిల పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని వార్తలు వస్తున్నా…. అందుకు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆ పార్టీ కీలక నేత, పీసీసీ అధ్యక్షుడు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి కె శివకుమార్ తో షర్మిల రెండు సార్లు భేటీ అయ్యారు. తమ కలయిక లాంఛన ప్రాయమేనని, కేవలం శుభాకాంక్షలు తెలిపేందుకే కలిశానని షర్మిల చెప్పినా కూడా పలురకాల రాజకీయ ఊహాగానాలు చెలరేగాయి. షర్మిల పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల అవగాహన కుదుర్చుకునే వ్యవహారంపై డి కె శివకుమార్, షర్మిల చర్చలు జరిపినట్లు వార్తలు వెలువడ్డాయి.

దీనికి షర్మిల సూత్రప్రాయంగా అంగీకారం తెలుపడంతో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా షర్మిలతో టెలిఫోన్ లో మాట్లాడారు… తర్వాత షర్మిల రాహుల్ గాంధీతో కూడా సమావేశం అవుతారని వార్తలు వెలువడినా అది నిజం కాలేదు. అయితే …. షర్మిల పార్టీ…. కాంగ్రెస్ పార్టీ కలిసి పని చేయడం కన్నా కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీని విలీనం చేయడమే ఉత్తమమని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి షర్మిల మొదట్లో సిద్ధపడలేదు.. దాంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ రంగంలో దిగి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధమని కాంగ్రెస్ పెద్దలకు తెలిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే షర్మిల పాదయాత్ర కోసం తెలంగాణ లో తాము ఎంతో డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చిందని….. ఇంకా ….. ఎన్నికల సమయం వరకూ పార్టీని నడపడం అంటే ఆ ఖర్చు తాము భరించలేమని అనిల్ కుమార్ కాంగ్రెస్ పెద్దలకు చెప్పినట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని బ్రదర్ అనిల్ కాంగ్రెస్ నాయకులకు మాటిచ్చారు.

దాంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ షర్మిల భర్త అనిల్‍కు ఫోన్ చేశారు. ఇవాళ లేదా రేపు విజయమ్మ, షర్మిలతో సోనియా చర్చలు జరుపుతారని కూడా తెలిసింది. జగన్ టార్గెట్‍గా కాంగ్రెస్ వ్యూహం సిద్ధం చేసిందని చెబుతున్నారు. జులై 8న ఇడుపులపాయకు సోనియా, రాహుల్ గాంధీ రావాలని కూడా యోచిస్తున్నారు. అక్కడ ఆ రోజు వైఎస్సార్ కు కాంగ్రెస్ అగ్రనేతలు నివాళులర్పించనున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలి వైఎస్సార్ అనుకున్నారు. తండ్రి కోరిక నెరవేర్చేందుకు కాంగ్రెస్ వైపు షర్మిల అడుగులు వేస్తున్నారు.

Related posts

పరిశుభ్రతకు OYO, యునిలివర్ భాగస్వామ్యం

Satyam NEWS

ప్రతి విద్యార్ది జాతీయ సేవా పథకంలో భాగస్వాములు కావాలి

Bhavani

జుక్క‌ల్‌లో రైతు వ్య‌తిరేక బిల్లుల‌పై నిర‌స‌న‌

Sub Editor

Leave a Comment