23.2 C
Hyderabad
May 7, 2024 21: 35 PM
Slider తెలంగాణ

రోడ్డు మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

dgp

నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నందున్న ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆయన కోరారు.

ప్రజా ఆరోగ్యం కోసం ఇవాళ్టి నుంచి 31 మార్చ్ వరకు తెలంగాణ లాక్ డౌన్ అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. జీవో 45 కచ్చితంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. వచ్చే వారం పది రోజులు క్రమశిక్షణతో ఉండాలని, సమస్యను అరికట్టాలి అంటే ప్రజాలేవరూ రోడ్ల పైకి రావద్దని కోరారు.

ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణ సమాజం కోసం పోలీసులు స్ట్రిక్ గా ఆంక్షలు అమలు చేస్తారని డీజీపీ తెలిపారు. అజాగ్రత్తగా ఉంటే తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందని, డే టైం లో అమలులో ఉండే నిత్యావసర వస్తువులు అన్ని రాత్రి 7 గంటలకు క్లోజ్ చేస్తామని ఆయన తెలిపారు. ఒక కాలనీ లో వెహికిల్ లో ఒకటి రెండు కిలో మీటర్ల మాత్రమే తిరగాలని, ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారు, ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే వెహికిల్ సీజ్ చేస్తారు. సీజ్ చేసిన వాహనాలు వైరస్ తీవ్రత తగ్గిన తరువాత రిలీజ్ చేస్తారని ఆయన తెలిపారు.

Related posts

మిషన్ భగీరథ పై రెండు మాటలు మాట్లాడుతున్న బిజెపి

Satyam NEWS

ఎన్టీఆర్ ను విమర్శించిన వారు చరిత్రహీనులు అవుతారు

Satyam NEWS

ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ లో విద్యార్థులకు కళ్ళద్దాలు పంపిణీ

Satyam NEWS

Leave a Comment