32.7 C
Hyderabad
April 27, 2024 00: 27 AM
Slider తూర్పుగోదావరి

ఎన్టీఆర్ ను విమర్శించిన వారు చరిత్రహీనులు అవుతారు

#chikkala

ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగుదేశం స్థాపించి తొమ్మిది నెలల కాలంలో మూడుసార్లు రాష్ట్రానికి సీఎం అయి చరిత్ర సృష్టించిన దివంగత సీఎం ఎన్టీ రామారావును అసమర్ధ సీఎం అంటూ వ్యాఖ్యలు చేసిన మంత్రి దాడిశెట్టి రాజాపై ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్ర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్పై విమర్శలు చేసిన వారు చరిత్ర హీనులవుతారన్నారు.

ఆనాడు జాతీయస్థాయిలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఒక కూటమి కట్టి దానికి చైర్మన్ గా వ్యవహరించిన సంగతిని మంత్రి రాజా తెలుసుకోవాలన్నారు. 1983లో ఎటువంటి హామీలు ఇవ్వకుండా ప్రజలకు ఉపయోగపడే రెండు రూపాయలకే కిలో బియ్యం, రైతులకు 50 రూపాయల హార్స్ పవర్, పేదలకు గృహ నిర్మాణం, ఆడపడుచులకు ఆస్తిలో హక్కులు కల్పించి జాతీయస్థాయిలో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ పై రాజా చేసిన వ్యాఖ్యలు అతను బేలా తనానికి నిదర్శనమన్నారు. ఎన్టీఆర్ ను విమర్శించిన వారికి స్థానిక ప్రజలు సమాధి కడతారనే విషయాన్ని గ్రహించాలని చిక్కాల పేర్కొన్నారు.

మంగళవారం కాకినాడలోని జిల్లా టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్ర రావు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్, మంత్రి రాజాలు కలిసి ఎన్టీఆర్ చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. విజయవాడలోని ఆరోగ్య యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టి 24 ఏళ్ల అవుతుందని ఈ కాలంలోని సీఎంలు ఎవరూ పేరు మార్చలేదని చిక్కాల అన్నారు. అర్ధరాత్రి ఆత్మ నాతో ఆత్మ మాట్లాడిందని అందుకే ఎన్టిఆర్ పేరు మారుస్తున్నానని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు హేళనగా ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ చరిత్ర తెలుసుకోకుండా ఆయన విమర్శిస్తే మీకు చరిత్ర ఉండదని చిక్కాల ఎద్దేవ చేశారు వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో 55 పథకాలు జగన్ పేరుతో 20 పథకాలు ఉన్నాయని అయినా వారికి పేర్ల మార్పు దాహం తీరలేదంటూ చిక్కాల విమర్శ చేశారు.

గత తూర్పు గోదావరిలో ఎన్టీఆర్ హయాంలో చేసిన పలు మంచి పనులను మంత్రి దాడిశెట్టి రాజా తెలుసుకోవాలని లేని పక్షంలో అతనికి ఆ నియోజకవర్గ ప్రజల చమర గీతం పాడుతారని చిక్కాల అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని అసమర్ధ  సీఎంగా జగన్ నిలిచారని చిక్కాల పేర్కొన్నారు.

Related posts

మద్యం మత్తులో అన్న ను కత్తితో పొడిచిన తమ్ముడు

Satyam NEWS

ఎక్సక్లూజీవ్: విశాఖ కు తరలివెళ్లేందుకు ముహూర్తం ఇదే

Satyam NEWS

టిఆర్ఎస్ తాలూకా యూత్ అధ్యక్షుడిగా అమర్ నాథ్

Satyam NEWS

Leave a Comment