42.2 C
Hyderabad
April 26, 2024 15: 06 PM
Slider ముఖ్యంశాలు

అన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థల్ని బలోపేతం చేస్తున్నాం

రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తెలంగాణ రాష్ట వాణిజ్య ప్రోత్సాహక సంస్థ ( TSTPC) డైరీ ని హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ శాసన సభ్యుడు హర్షవర్ధన్ రెడ్డి, TSTPC చైర్మన్ దేవరి మల్లప్ప, సంస్థ V C అండ్ MD శ వెంకట నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, అనుబంధ సంస్ధల బలోపేతానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చర్యలు తీసుకున్నారని అన్నారు.

TSTPC సంస్థ గతంలో పుస్తకాల ముద్రణకు, సరఫరాకు ప్రయివేట్ వారిపై ఆధారపడి నామమాత్రంగా ఉండేది. కానీ, నేడు స్వయం సంపత్తి తో ఉద్యోగుల సహకారంతో ప్రభుత్వ సంక్షేమ శాఖ గురుకులాలకు అన్ని రకాల పుస్తకాలను సరఫరా చేయటంతో పాటు ఎగుమతి సామర్ధ్యం గలిగిన సంస్థ గా అభివృద్ధి చేస్తున్న ఛైర్మన్ దేవరి మల్లప్ప, MD వెంకట నర్సింహారెడ్డి లను మంత్రి అభినందించారు.

Related posts

దిండుతో అదిమి పెట్టి వృద్ధ దంపతుల దారుణ హత్య

Satyam NEWS

ఏనుగు దాడిలో అయ్యప్ప భక్తుడి మృతి

Satyam NEWS

అక్రమ కేసులు సహించం

Bhavani

Leave a Comment