28.7 C
Hyderabad
April 27, 2024 05: 47 AM
Slider నిజామాబాద్

మతిస్థిమితం లేని వారికి భోజనం అందించిన భూమి ఫౌండేషన్

bhumi foundation

కరోనా మహమ్మారిని నియంత్రించడానికి ప్రకటించిన లాక్ డౌన్ కఠినంగా అమలుపరచడంతో బిచ్కుంద మండల కేంద్రంలో హోటల్లు మూసి వేశారు. యాచకులు, మతిస్థిమితం లేని వారి పరిస్థితి పట్టెడు అన్నం పెట్టె వారు లేక మరీ దారుణంగా తయారైంది.

వివిధ గ్రామాల నుండి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులు వారి వెంట వచ్చే వారికి భోజనం దొరకక ఇబ్బందులు పడటం గమనించిన భూమి ఫౌండేషన్ సభ్యులు వారి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో స్వయంగా సభ్యుల ఇంటిలో వంటకాలు తయారు చేసి వారి ఆకలి తీరుస్తున్నారు.

శుక్రవారం పాత బస్టాండ్ లో మతిస్థిమితం లేని ఇద్దరు వ్యక్తులకు పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి చేతుల మీదుగా భోజనం అందించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్న భూమి ఫౌండేషన్ సభ్యులకు  కార్యదర్శి అభినందించారు.

ఇలాంటి కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని సభ్యులకు తెలియజేశారు. అనంతరం భూమి ఫౌండేషన్ సభ్యులు బస్వరాజ్ మాట్లాడుతూ రోజు సుమారు 40 వ్యక్తులకు స్వయంగా తమ ఇంటిలో వంటలు చేసి పాదచారులకు, ఆసుపత్రికి వచ్చే రోగులకు వెంట వచ్చిన వారికి, యాచకులకు, మతిస్థిమితం లేని వాళ్లకు రెండు పూటల భోజనం అందిస్తున్నామని అన్నారు.

దానాలకంటే అన్నదానం గొప్పదనీ యాచకులకు మతిస్తిమితం లేని వారికి భోజనం పెట్టడం ఎంతో అబినందనీయం అని మండల ప్రజలు హర్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ రాజు, భూమి ఫౌండేషన్ సభ్యులు విట్టల్, వెంకటేష్, అనిల్, సంగమేశ్వర్, శ్రీనివాస్ ఉన్నారు.

Related posts

30 పాఠ‌శాల‌ల‌ను ఎత్తివేసే యోచ‌న‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం…!

Satyam NEWS

వైసీపీ కార్యకర్తల భూములు ఆక్రమించేసిన వైసీపీ నేత

Satyam NEWS

డిసెంబర్ 4న శ్రేయాస్ ఎటిటి ద్వారా “రాంగ్ గోపాల్ వర్మ” విడుదల

Satyam NEWS

Leave a Comment