37.2 C
Hyderabad
May 1, 2024 13: 48 PM
Slider విజయనగరం

30 పాఠ‌శాల‌ల‌ను ఎత్తివేసే యోచ‌న‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం…!

#cpmvijayanagaram

విజయనగరం మున్సిప‌ల్ కార్పొరేష‌న్  33 వ డివిజన్ నాగోజిపెటలో ఉన్న ఎలిమెంటరీ స్కూలు ఎత్తివేతకు నిరసనగా సీపీఎం నగర కమిటీ… స్కూల్ వద్ధ నిరసన ధర్నా నిర్వ‌హించింది.. ఈ ధర్నానుద్ధేసించి సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు మాట్లాడు తూ…..కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానం దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయకపోయినా ఏపీలో జ‌గ‌న్  ప్రభుత్వం అమలుకు పూనుకుంటోంద‌ని విమ‌ర్శించారు.

అందులో బాగంగా నే ఎలిమెంటేరి స్కూల్ ను హైస్కూల్ ల్లో విలీనం చేస్తూ 1,2 తరగతులు ను అంగన్ వాడి కేంద్రాలకు అప్పచెప్పి.3,4,5 తరగతుల ను హై స్కూల్ లో విలీనం చేస్తూన్నారని ఆరోపించారు. ఇందులో బాగంగా  నాగిజిపేట,ఎలిమెంటరీ స్కూలు ను వీటీ అగ్రహారం హైస్కూల్ లో కలుపుతున్నార‌ని సీపీం ఆరోపించింది.. ఇక్కడనుండి విద్యార్థినీ విద్యార్థులు  అంతదూరం ఎలావెళ్లగలరు అని ఆ పార్టీ న‌గర కార్య‌ద‌ర్శి రెడ్డి శంకర‌రావు ప్రశ్నించారు.

ఇప్పటికే స్కూల్ ను విలీనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందిని. ప్రకటనలు కూడా చేశారని రెడ్డి శంక‌ర‌రావు అన్నారు. ఈ విదంగా జ‌రిగితే భవిష్యత్తులో పేదలకు విద్య దూరమై పోతున్నదని. రెడ్డి శంకరరావు అభిప్రాయ ప‌డ్డారు..ఇప్ప‌టికే  నగరంలో 30 స్కూల్ లని ఎత్తివేయాలని  ప్రభుత్వం యోచించ‌డ‌మే కాక‌…తీసుకున్న‌ నిర్ణయం వెనక్కి తీసుకో వాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాపోరాటం ద్వారా నే అడ్డుకుంటామని  సీపీఎం న‌గ‌ర  క‌మిటీ హెచ్చరించింది.ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కమిటీ సభ్యులు బీ.రమణ. కె. సురేష్ .తది తరులు పాల్గొన్నా రు.

Related posts

అమృతమే

Satyam NEWS

చిరంజీవి ఫ్యాన్స్ ను చితక్కొట్టిన అనంతపురం పోలీసులు

Satyam NEWS

శిక్షణా మైదానాన్ని సందర్శించిన ఎస్పీ

Murali Krishna

Leave a Comment