23.7 C
Hyderabad
May 8, 2024 05: 58 AM
Slider ప్రత్యేకం

చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ తో మంత్రి కేటీఆర్ సమావేశం

minister ktr 27

భారతదేశ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ తో మంత్రి కే తారకరామారావు సమావేశమయ్యారు. హైదరాబాద్ లో పర్యటిస్తున్న చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ ఈరోజు ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో తీసుకున్న చర్యలు, పెట్టుబడుల సేకరణ కోసం చేస్తున్న ప్రయత్నాలను, ఈ దిశగా అందుకున్న విజయాలను అడ్వైజర్ కి వివరించారు. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రాధాన్యతలను సుబ్రమణ్యన్  తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధాన పరమైన నిర్ణయాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా కేటీఆర్, సుబ్రహ్మణ్యన్ కు సూచించారు. గతంలో హైదరాబాద్ ఐ యస్ బి లో పనిచేస్తున్న నాటి నుంచి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ తో తనకు మంచి బంధం ఉందన్న కేటీఆర్, ఆయన ఆధ్వర్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

అన్ని వ్యవస్థలనూ ‘పోలరైజ్’ చేస్తున్న ఏపి రాజకీయం

Satyam NEWS

జులై 3 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

Satyam NEWS

ఆయుష్మాన్ భారత్ ను కేసీఆర్ ఎందుకు అమలు చేయడం లేదు?

Satyam NEWS

Leave a Comment