37.2 C
Hyderabad
April 26, 2024 20: 54 PM
Slider సినిమా

న్యూ రిలీజ్: మార్చి 6న వస్తున్న పలాస 1978

phalsa

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’. తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. డైరెక్టర్ కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ ఈ సినిమా ప్రివ్యూ చూసిన వారు ఇస్తున్న స్పందన నాకు మరింత బలాన్ని ఇచ్చింది. తెలుగు సినిమా లలో “పలాస 1978″ భిన్న మైనది అని ఖచ్చితంగా చెప్పగలను. రైటర్ ఉన్న నన్ను దర్శకుడిగా అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ కి థాంక్స్.

ఈ సినిమా కు కథ నుండి రిలీజ్ వరకూ అండ గా నిలిచిన తమ్మారెడ్డి భరద్వాజ కి చాలా థాంక్స్. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవడం చాలా ఆనందం గా ఉంది” అన్నారు. రఘు కుంచె మ్యూజిక్ అందించడమే కాకుండా ఇక కీలక పాత్ర ను పోషించారు. శ్రీకాకుళం జానపదం నుండి తీసుకున్న’ నీ పక్కన పడ్డాదిరో చూడర పిల్లా..నాది నక్కీ లీసు గొలుసు’ పాట సోషల్ మీడియా లో విశేష ఆదరణ పొందుతుంది.

ఈ సినిమా చూసి బాగా నచ్చి” మీడియా 9 మనోజ్”  రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ ని ఫ్యాన్సీ రేట్స్ కి సొంతం చేసుకున్నారు. రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 6 న విడుదలకు సిద్దం అవుతున్న  ఈ చిత్రానికి  పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచె.

Related posts

తుఫాను స‌హాయ‌క చ‌ర్య‌ల్లో స్థానిక ప్ర‌తినిధుల స‌హ‌కారం

Satyam NEWS

అన్ని ఏర్పాట్లూ చేశాం ఓటు హక్కు వినియోగించుకోండి

Satyam NEWS

పువ్వుల రాశినే దేవతా మూర్తిగా భావించి పూజ చేయడం బతుకమ్మ విశిష్టత

Satyam NEWS

Leave a Comment