40.2 C
Hyderabad
April 26, 2024 13: 36 PM
Slider విజయనగరం

తుఫాను స‌హాయ‌క చ‌ర్య‌ల్లో స్థానిక ప్ర‌తినిధుల స‌హ‌కారం

#vijayanagaramzp

విజ‌య‌న‌గ‌రం   జిల్లాలో గులాబ్‌తుఫాను ప్ర‌భావానికి గురైన మండ‌లాల్లో ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయ పున‌ర‌వాస కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌పుడు ఆయా మండ‌లాల్లోని స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధులైన ఎంపిపి, జెడ్పీటీసీ, ఎంపిటిసి, స‌ర్పంచ్‌ల‌ను సంప్ర‌దించి వారి స‌హ‌కారంతో స‌మ‌న్వ‌యం చేసుకొంటూ ముందుకు వెళ్లాల‌ని జిల్లాప‌రిష‌త్ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు సూచించారు.

జిల్లాలో తుఫాను కార‌ణంగా ఆయా మండ‌లాల్లో నెల‌కొన్ని ప‌రిస్థితులు, యంత్రాంగం ద్వారా చేప‌డుతున్న బాధిత ప్ర‌జ‌ల‌కు చేప‌డుతున్న‌ స‌హాయ కార్య‌క్ర‌మాల‌పై త‌న నివాసం నుంచి  టెలికాన్ఫ‌రెన్స్ ద్వారా తుఫాను ప్ర‌భావిత మండ‌లాల అధికారుల‌తో మాట్లాడారు.

ఆయా మండ‌లాల్లో తాగునీటి స‌ర‌ఫరా ప‌రిస్థితి, విద్యుత్ స‌ర‌ఫ‌రా పునరుద్ద‌ర‌ణ ప‌నులు, ఇళ్ల న‌ష్టం వివ‌రాల సేక‌ర‌ణ‌పై తెలుసుకున్నారు. తుఫాను ప్ర‌భావానికి గురైన పూస‌పాటిరేగ‌, భోగాపురం, పాచిపెంట‌, మ‌క్కువ‌, గ‌జ‌ప‌తిన‌గ‌రం, సాలూరు మండ‌లాల అధికారుల‌తో జెడ్పీ ఛైర్మ‌న్ మాట్లాడారు.

ఈ మండ‌లాల్లో ఇళ్లు దెబ్బ‌తిన్న వారిని గుర్తించి వారికి త‌క్ష‌ణ స‌హాయం అందించేందుకు స‌చివాల‌య సిబ్బంది సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని చెప్పారు. బాధితులంద‌రికీ ప్ర‌భుత్వం త‌ర‌పున స‌హాయం అందేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు.

Related posts

హిందూత్వం అంటే మతం కాదు ధర్మం…

Satyam NEWS

యూపీఏ లేదన్న మమతాకు కాంగ్రెస్ గట్టి కౌంటర్

Sub Editor

ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ వచ్చేస్తే…

Satyam NEWS

Leave a Comment