33.7 C
Hyderabad
April 28, 2024 23: 07 PM
Slider హైదరాబాద్

పువ్వుల రాశినే దేవతా మూర్తిగా భావించి పూజ చేయడం బతుకమ్మ విశిష్టత

#batukammakapra

రకరకాల పరిమళ భరిత పువ్వులతో దేవతలను పూజించడం హైందవ సంప్రదాయం. అయితే పువ్వుల రాశినే దేవతా మూర్తిగా భావించి పూజ చేయడం ఈ పండుగ ప్రత్యేకత అదే బతుకమ్మ పండుగ.  ప్రతి మనిషికి ప్రకృతితో విడదీయరాని సంబంధం ఉంటుంది.  బతుకమ్మ పండుగకి తొమ్మిదిరోజులపాటు మనిషి ప్రకృతితో మమైకమైపోతాడు. 

అదే బతుకమ్మ పండుగ గొప్పతనం. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు.  ఈ రోజు ఆడపడుచులు అందరూ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు.

కాప్రా సర్కిల్ శ్రీనివాస్ నగర్ హోసింగ్ వెల్ఫేర్, శ్రీనివాస్ నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం సద్దుల బతుకమ్మ సందర్భంగా కాలనీ పార్క్ లో బతుకమ్మ పండుగ ఒక వేడుకగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి పిసిసి కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి లు హాజరై మహిళలకు బహుమతులు ప్రధానం చేశారు. 

కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు గూడూరు సుదర్శన్ రెడ్డి, మోహన్, ఏం సాంబయ్య, ఉపేంద్ర చారి, నాగన్న, కృష్ణారెడ్డి, ఆనంద్, పాండు, ఓం ప్రకాష్, నరసింహ గౌడ్, నరసింహ రెడ్డి, శశిధర్ రావు, శ్రీకాంత్, రంజిత్, కిషోర్ కుమార్, మధు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

తహసీల్దార్ ఆఫీస్ కు తాళి ఘటన పై జిల్లా కలెక్టర్ సీరియస్

Satyam NEWS

నలుగురు మంత్రుల వ్యూహంలో నలిగిపోయిన ఎల్ వి

Satyam NEWS

పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు ఆహార పదార్ధాలు

Satyam NEWS

Leave a Comment