28.7 C
Hyderabad
April 27, 2024 03: 51 AM
Slider జాతీయం ప్రత్యేకం

రిటైర్మెంట్ యోచనలో మోడీ

modi 56

భారతీయ జనతా పార్టీలో వయసు పరిమితి విధించిన నరేంద్రమోడీ ఆ రూల్ తనకూ వర్తిస్తుందని నిరూపించబోతున్నారు. ప్రధానిగా 2024 వరకూ ఆయన పదవీకాలం ఉంది. అప్పటికి మోడీకి 74 ఏళ్ళు వస్తాయి. 75 ఏళ్ళు దాటిన వారు రాజకీయాల్లో ఉండరాదని ఆయన షరతు పెట్టుకున్నారు. అందువల్ల 2024 ఎన్నికల్లో బీజేపీని మరో మారు గెలిపించి మోడీ రాజకీయాల నుంచి పూర్తిగా రిటైర్ అవుతారని అంటున్నారు. ఈ లోగా భవ్యమైన రామ మందిరాన్ని కూడా అయోధ్యలో నిర్మించాలని మోడీ కలలు కంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అంటే అపజయం ఎరుగని వీరుడుగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేశారు. అక్కడ నుంచి జాతీయ రాజకీయాల్లోకి వస్తూనే ఏకంగా ప్రధాని అయిపోయారు. ఒకటి కాదు రెండు మార్లు ప్రధాని కుర్చీలో ఆయన కూర్చున్నారు. మోడీ రాజకీయ జీవితంలో చాలా సాధించారు. దేశంలో ఏ ప్రధాని చేయలేని పనులు కూడా ఎన్నో చేశారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించి ఆయన నెహ్రూను కూడా మించాడని ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ముస్లిం సమాజాన్ని కూడా జాతీయ స్రవంతిలో కలుపుకుంటూ ట్రిపుల్ తలాక్ రద్దు చేశారు. పాకిస్థాన్ పీచమణిచిన మోడీ ఇక పాక్ నుంచి శాశ్వతంగా ముప్పు లేకుండా చేయాలనుకుంటున్నారు. అదే విధంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పదేళ్ల పాటు మాత్రమే ఉంచిన రిజర్వేషన్లు ఏ సర్కార్ ముట్టుకోవడానికి కనీసంగా కూడా సాహసించడంలేదు. మోడీ మాత్రం దాన్ని కూడా టచ్ చేసి ఆధునిక భారతాన్ని ఆవిష్కరించాలనుకుంటున్నారు. వీటితో పాటు మోడీ ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు కూడా నిర్వహించాలని పరితపిస్తున్నారు. ఒకవేళ అది కుదరకపోతే 2024లో ఎన్నికలు వస్తాయి. బీజేపీలో మోడీ పెట్టిన నిబంధన మేరకు మొత్తం మీద మోడీ మరో నాలుగైదేళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఉంటారని చెబుతున్నారు. చూడాలి మరి.

Related posts

ఫిబ్రవరికి యూరప్‌లో 5 లక్షల మరణాలు డబ్ల్యూహెచ్ఓ

Sub Editor

ఆక్సిజన్ సరఫరాను అడ్డుకునే వారికి ఉరిశిక్ష

Satyam NEWS

‘డై హార్డ్ ఫ్యాన్ మోష‌న్ పోస్ట‌ర్ కి అనూహ్య స్పంద‌న‌

Satyam NEWS

Leave a Comment