32.2 C
Hyderabad
May 2, 2024 02: 44 AM
Slider నిజామాబాద్

ప్రొటెస్టు: ప్రభుత్వ చర్యపై అంగన్వాడి కార్యకర్తల నిరసన

anganwadi

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో  అంగన్వాడి కేంద్రాలు మూసివేయడమూ, కలిపివేయడమో చేయాలనే నిర్ణయాన్ని రాష్ట్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఐసిడిఎస్ ను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ జుక్కల్ నియోజకవర్గం లోని ఆయా మండలాల అంగన్వాడీ కార్యకర్తలు తహశీల్దార్లకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పది మంది ఉన్న ప్రీ స్కూల్ పిల్లలు పదిహేను మంది ఉన్న గర్భిణి బాలింతల కంటే తక్కువ హాజరు శాతం అంగనవాడీ  కేంద్రాలను మూసివేయడం లేదా రెండు మూడు కేంద్రాలను ఒక దగ్గర క్లబ్ చేయడం కోసం హాజరు వివరాలను రాష్ట్రమంతటా సేకరిస్తున్నారని, ఈ నెలలోపే ఆ ప్రక్రియ పూర్తి కావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు  పత్రికల్లో వచ్చాయని వారు వాపోయారు.

దీనివలన ఐసిడియస్ సేవలు పేద ప్రజలకు దూరమవుతాయని వారన్నారు. పేద గర్భిణులకు బాలింతలకు సేవలందిస్తున్న అంగన్వాడీ కేంద్రాలు నిరుపేదలకు అందని ద్రాక్షగా మారాతాయని వారితో పాటు అంగన్వాడి ఉద్యోగులు కూడా ఉద్యోగ భద్రత కోల్పోవల్సి వస్తుందన్నారు. కావున ప్రభుత్వం తమ నిర్ణయాలు మరొకసారి పునరాలోచించి అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని వారు తహసీల్దార్ వెంకట్రావుకు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆనసుజా  మంగళ బాయి, శాంతాబాయి, గంగమణి సావిత్రి, వజ్రమణి ఆయా మండలాల అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

రామతీర్థం దేవస్థానంలో శ్రీరామ‌న‌వమి ఉత్స‌వాలు

Satyam NEWS

మునిగిపోతున్న మహిళల్ని కాపాడిన పోలీసులు

Bhavani

క్వశ్చన్ అవర్: బిజెపితో హనీమూన్ పిరియడ్ ముగిసిందా?

Satyam NEWS

Leave a Comment