30.7 C
Hyderabad
May 13, 2024 01: 53 AM
Slider

జిల్లా అభివృద్ధి కి చర్యలు

#Puvvada Ajay

జిల్లా సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు గ్రామంలో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు మంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కెవి సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవం చేసి సర్పంచ్ ను సీట్ లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.

చిలక్కొయాలపాడు-సీరోడు రోడ్డు నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడ్డ నాటికి మనకు 7,770 మెగా వాట్స్ విద్యుత్ మాత్రమే ఉండగా, నేడు అది 18వేల మెగా వాట్స్ కు చేరుకుందని, త్వరలో 25 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుందని తెలిపారు. రైతులకు 24 గంటలు ఉచిత కరంట్ ఇస్తున్నట్లు ఆయన అన్నారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చాక తలపెట్టిన ప్రాజెక్ట్ లు పూర్తి చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

సీతారామ ప్రాజెక్ట్ ఒక్కటే మిగిలింది.ఇప్పటికే తలపెట్టిన అన్ని ప్రాజెక్ట్ లు పూర్తి చేసి రైతులకు పుష్కలంగా సాగునీరు అందిస్తున్నామన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటుకు పూర్వం త్రాగు, సాగునీటికి తిరుమలాయపాలెం మండల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారని, తెలంగాణ ఏర్పాటుతో భక్త రామదాసు ప్రాజెక్ట్ తో సాగునీరు, మిషన్ భగీరథ తో ఇంటింటికి త్రాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు కూలీనాలికి ఇతర ప్రదేశాలకు వెళ్ళేవారని, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుండి మన ప్రాంతానికి వస్తున్నారని అన్నారు.

గత 10 సంవత్సరాల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, నీరు లేక బావులు, బోరింగులపై ఆధారపడి, కరంట్ లేక ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ప్రాంతం ఇప్పుడు సుభిక్షంగా మారి, ఆంధ్రా ప్రాంతానికి పోటీగా పంటలు పండించే స్థాయికి చేరుకుందని తెలిపారు.

కార్యక్రమంలో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, వచ్చే మార్చి, ఏప్రిల్ నాటికి రోడ్లన్నీ పూర్తి చేస్తామన్నారు. ఎంతో వెనుకబడ్డ ప్రాంతమని, ప్రభుత్వ చర్యలతో ఇప్పుడు ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉన్నారన్నారు. కెనాల్ కు భూసేకరణ క్రింద భూమి పోకుండా, టన్నెల్ ఏర్పాటు చేసి, ప్రణాళికాబద్ధంగా 600 ఎకరాలు భూసేకరణ చేయకుండా చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Related posts

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్

Satyam NEWS

అంబేద్కర్ ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి

Satyam NEWS

‘రిజర్వు’ నిధులతో ఏం చేస్తారో?

Satyam NEWS

Leave a Comment