29.7 C
Hyderabad
May 2, 2024 05: 48 AM
Slider ఆంధ్రప్రదేశ్

పౌరసత్వ సవరణ బిల్లు ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్దమే

vij muslims

పౌరసత్వ సవరణ బిల్లు పై ప్రజా సంఘాలు మండిపడ్డాయి. జమియతే ఉలేమా ఏ హింద్, జమాత్ ఏ ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో విజయవాడలోని పంజా సెంటర్, ఆటోనగర్, ధర్నా చౌక్ లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. సనత్ నగర్ లో జరిగిన కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ బిల్లు ముస్లింలను అభద్రతా భావం లోకి నెడుతున్నదని ఆయన అన్నారు. కార్గిల్ యుద్ధవీరులకు, మాజీ రాష్ట్రపతి కుటుంబానికి కూడా పౌరసత్వం ఇవ్వడానికి నిరాకరించడాన్ని చూస్తే రాబోయే కాలంలో దేశ వ్యాప్తంగా ముస్లింలకు పౌరసత్వం లేకుండా చేసే కుట్ర దీనిలో దాగి ఉందని ఆయన అన్నారు.

తమకు పౌరసత్వం రాదేమోనన్న భయంతో అనేకమంది అస్సాం ,బెంగాల్ లలో ఆత్మహత్య లు చేసుకున్నారని ఆయన అన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా అస్సాం, బెంగాల్ ప్రజల‌ లాగా శాసనోల్లంఘన కు దిగాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్దమని మౌలానా హుస్సేన్ అన్నారు.

ఈ బిల్లు రాజ్యాంగపు మౌలిక స్వరూపాన్ని మార్చివేస్తుందని, అధికరణ14,15,21,25 లకు‌ ఈ బిల్లు తూట్లు పొడిచిందని ఆయన అన్నారు. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడంతో మన దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా దిగజారిందని ఏ నాగరిక సమాజం కూడా దీనిని అంగీకరించదని జమాత్ ఇస్లామ్ నాయకులు మౌలానా ముజహిద్ తీవ్రంగా ఖండించారు.

ఇలాంటి నల్లచట్టాలకు సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునే వారు కూడా మద్దతు ఇచ్చి అవకాశవాద రాజకీయాలు చేసి దేశ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడం శోచనీయమని ఫారూఖ్ షిబిలి అన్నారు. అలాగే పౌరసత్వ నిరూపణ కోసం ఎవరూ ఏ విధమైన పత్రాలు చూపించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

బెంగాల్, కేరళ రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకుని మన రాష్ట్రం లో కూడా  NRC,CAB లను అమలు పరచరాదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శన కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, జమాతే ఇస్లామీ హింద్, జమైయత్ ఉలేమా ఏ హింద్, అవాజ్, ఆలిండియా మిల్లీ కౌన్సిల్, అమన్, తదితర ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.

Related posts

తీన్మార్ మల్లన్న కార్యాలయంలో పోలీసు తనిఖీలు (వీడియో చూడండి)

Satyam NEWS

దళితుడికి గుండు కొట్టించిన సినీ దర్శకుడు

Satyam NEWS

భారీ వర్షాల నేపథ్యంలో రేపు సెలవు ప్రకటించిన సి.ఎం. కేసీఆర్

Satyam NEWS

Leave a Comment