31.7 C
Hyderabad
May 2, 2024 10: 31 AM
Slider ముఖ్యంశాలు

ఉక్రెయిన్ నుంచి 11 మంది విజయనగరం జిల్లా విద్యార్ధుల‌ వాపస్

#suryakumariias

ప్ర‌పంచలోనాల్గొయుద్దం మొద‌లైన‌ట్టే.. ర‌ష్యా-ఉక్రేయ‌న్ల‌మ‌ధ్య భీకర యుద్దఃం జ‌రుగుతోంది. నేష‌న‌ల్ చాన‌ల్స్ అన్నీ…దీనిపైపే ఫోక‌స్ పెట్టాయి. ఇక కేంద్ర ప్ర‌భుత్వం… ఉక్ర‌యిన్,ర‌ష్యాలో  ఉన్న భార‌తీయ‌ల‌ను స్వ‌దేశానికి ర‌ప్పించే చ‌ర్య‌లు ప్రారంభించింది కూడ‌.

ఇప్ప‌టికే మూడు ప్ర‌త్యేక విమానాల‌లో్..ఇండియాకు వచ్చారు. ఈ సంద‌ర్బంగానే కేంద్ర విధేశాంగ మంత్రి స్వ‌యంగా విమానంలో ఉన్న భార‌తీయుల‌తో్ మాట్లాడి…వాళ్ల‌లో స్వాభిమానం,స్వ‌దేశంలో అంద‌రూ మీకోసం ఎదురు చూస్తున్నార‌న్న మాట‌లు చెప్పి వారిలోమ‌నోదైర్యాన్ని నింపారు.ఇదిలా ఉంటే…  ఉక్రెయిన్‌లో నెల‌కొన్న అనిశ్చిత ప‌రిస్థితుల నేప‌థ్యంలో అక్క‌డ వివిధ విద్యాసంస్థ‌ల్లో చ‌దువుతున్న జిల్లాకు చెందిన 11 మంది విద్యార్ధులు ఉన్న‌ట్టు గుర్తించ‌డం జ‌రిగింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్  సూర్య‌కుమారి తెలిపారు.

రాష్ట్రం నుంచి ఉక్రెయిన్‌లోని విద్యాసంస్థ‌ల్లో చ‌దువుతున్న 620 మంది విద్యార్ధుల్లో 301 మంది విద్యార్ధుల‌ను   స్లొవేకియా స‌రిహ‌ద్దుకు రెండు రైళ్ల‌లో చేర్పించే ఏర్పాట్లు చేశార‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. వారంద‌రినీ ప్ర‌త్యేక విమానంలో భార‌త్‌కు ర‌ప్పించే ఏర్పాట్ల‌ను కేంద్ర విదేశీ వ్య‌వ‌హారాల శాఖ చూస్తున్న‌ట్లు కలెక్ట‌ర్ ఈ సంద‌ర్బంగా  పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌లో చ‌దువుతున్న జిల్లాకు చెందిన‌ విద్యార్ధుల వివ‌రాలు

ఇక జిల్లాకు సంబంధించి ఉక్ర‌యిన్ 11 మంది విద్యార్దులు చ‌దువుకుంటున్న‌ట్టు జిల్లాయంత్రాంగం గుర్తించింది. ఈ మేర‌కు గత రాత్రే ఆ విద్యార్ధుల క‌న్న‌వారితో  జిల్లా క‌లెక్ట‌ర్ వీడియో కాల్ ద్వారా…మాట్లాడారు. మీపిల్లల‌ను క్షేమంగా ఇండ్ల‌కు పంపించే ఏర్పాట్లు జ‌ర‌గుతున్నాయ‌ని  క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్బంగా విద్యార్దుల క‌న్న‌వాళ్ల‌కు చెప్పారు. ఆ విద్యార్ధుల వివరాలు  ఈ విధంగా ఉన్నాయి

1. శ్రేయ ఆనంది, D/o వెంక‌ట‌కృష్ణ‌, బాలాజీ న‌గ‌ర్‌, సాలూరు

2. య‌శ్వంత్ కుమార్ పంచారియా S/o అశోక్ పంచారియా, కంచ‌ర‌వీధి, పార్వ‌తీపురం

3. రెడ్డి నిఖిల్ కుమార్‌, S/o శ్రీ‌నివాస‌రావు, భూముల వీధి, బొబ్బిలి

4. పాలూరి మౌళిక‌, D/o పాలూరి ప్ర‌సాద‌రావు, కోడి వారి గ‌ల్లీ, విజ‌య‌న‌గ‌రం

5. శ్రీ‌పురుషోత్తం మైత్రేయి, D/o రామ‌కృష్ణ ప్ర‌సాద్‌, చిన్న‌ప‌ల్లి వీధి, పూల్‌బాగ్ రోడ్డు, విజ‌య‌న‌గ‌రం

6. నిష్ట‌ల హ‌ర్ష‌తేజ‌, S/o వెంక‌ట కామేశ్వ‌ర‌శ‌ర్మ‌, సాయిన‌గ‌ర్ కాల‌నీ, Opp: రైల్వేస్టేష‌న్‌, కొత్త‌వ‌ల‌స‌

7. కోట నాగ‌ల‌క్ష్మీచ‌రిత‌, D/o కోట నాగ‌రాజు, వెల్లంకి వీధి, సాలూరు

8. పోతుపురెడ్డి పుష్క‌ర‌ణి, D/o దేముడు, ఉడా కాల‌నీ, అయ్య‌న్నఅగ్ర‌హారం, పాల్ న‌గ‌ర్‌, విజ‌య‌న‌గ‌రం

9. తోట సాయివంశీ, S/o తోట సింహాచ‌లం, దేవాడ‌, గ‌రివిడి (మండ‌లం)

10. జితేంద్ర‌కుమార్ స‌రిడి, S/o గోవింద‌రావు, బి.సి.కాల‌నీ, బుద‌రాయ‌వ‌ల‌స‌, మెర‌క‌ముడిదాం(మం)

11. అభిజిత్ శ‌శికుమార్‌, S/o శ‌శికుమార్ కేశ‌వ‌న్‌, శ్రీఅచ్చిమాంబ నిల‌యం, ఉడాకాల‌నీ, కంటోన్మెంట్‌, విజ‌యన‌గ‌రం

Related posts

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దిగజారిన కేసీఆర్

Satyam NEWS

ఏపిలో మధ్యాహ్నం 1 గంట వరకు బస్సులు బంద్

Satyam NEWS

గిరిజన విద్యార్థులకు మంచి ర్యాంకులు రావాలి

Bhavani

Leave a Comment