29.7 C
Hyderabad
May 2, 2024 05: 42 AM
Slider ప్రకాశం

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలన అస్తవ్యస్తం

#EluriSambasivarao

వైసిపి రెండేళ్ల పాలన అస్తవ్యస్తంగా ఉందని సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై ముద్రించిన పుస్తకమంతా అబద్ధాల పుట్ట, అసత్యాల కూటమిఅన్నారు.

ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి, యువతకు ఉపాధి అన్న వ్యక్తి, ఇప్పుడు కేసుల భయంతో దాని ఊసే ఎత్తడంలేదు. చివరకు ఆర్డినెన్స్ ల రూపంలో బడ్జెట్ అమోదించుకునే దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చాడని దుయ్యబట్టారు.

2018-19లో మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 36.32 శాతం వరకు ఎకనామిక్ సర్వీసెస్ కుఖర్చుచేశారని,  2019-20 లో 22.19శాతం, 2020-21 లో24.91శాతంలోపే ఖర్చు పెట్టారన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్ పుస్తకాల్లోనే ఈ విషయాన్ని పేర్కొన్నారు. 

రెండేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పడానికి బడ్జెట్ లో ఎకనామిక్ సర్వీసెస్ కు చేసిన కేటాయింపులే నిదర్శనమన్నారు. 2018-19లో రూ.16,859కోట్లు కేపిటల్ ఎక్స్ పెండేచర్ కి ఖర్చు చేస్తే.. జగన్ ప్రభుత్వం 2019-20లో రూ.12,248కోట్లు మాత్రమేఖర్చుపెట్టిందన్నారు.

ఆదాయంలేదు ..కోవిడ్ వల్ల పడిపోయిందంటున్నారు. కోవిడ్ సమయంలోనే మద్యంపై పెరిగిన ఆదాయం గురించి, పెంచిన పన్నులు, ధరల ద్వారా పెరిగిన ఆదాయం గురించి ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు.

రెండేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు 28 శాతంనుంచి 38 శాతానికి పెరగడానికి ప్రభుత్వ వైఫల్యాలు కారణం కాదా.? అన్నారు.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.17,826 కోట్లతో అమలు చేసిన 17 సంక్షేమ పథకాలను జగన్ సర్కార్ రద్దు చేయడం వాస్తవం కాదా అన్నారు. పాత పథకాలకు పేర్లు మార్చడం, ఉన్నవాటిని తీసేయడమేనా సంక్షేమం అన్నారు.

ఆరోగ్యంకోసం ప్రజలు విపరీతంగా ఖర్చుపెట్టాల్సిన దుస్థితి కల్పించడం వాస్తవం కాదా. పేదలకు ఉచితంగా కోవిడ్ చికిత్స ఎందుకు అందించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. టీడీపీ హాయాంలో తలసరి ఆదాయం రెండంకెల్లో ఉంటే, ఇప్పుడు 1.03కి పడిపోయిందన్నారు. కేపిటల్ ఎక్స్ పెండేచర్, ఎకనామిక్ సర్వీసెస్ కు ఖర్చుపెట్టకుండా సంక్షేమానికి అరకొరగా కేటాయిస్తూ, అంతా బాగా చేశామనడం అబద్ధం కాదా…? జీఎస్ డీపీ, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ డ్యూటీలపై ఎందుకు ఆదాయం రావడంలేదో చెప్పే ధైర్యం ఉందా. అన్నారు.

ప్రజల జేబులు గుల్ల

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏడా, పెడా పన్నులు బాదేస్తూ జనం జేబులు గుల్ల చేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వాలు వున్నది ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికా .? లేక ప్రజల జీవన ప్రమాణాలు పణంగా పెట్టి రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుకోవడానికా ..? ప్రజల దుస్థితిని గుర్తించి ధరలు తగ్గించాల్సిన ప్రభుత్వం ప్రతి రోజు ధరలు పెంచి మరింత ఆర్ధిక ఇబ్బందుల పాలు చెయ్యడం బాధ్యాతా రాహిత్యం కాదా అన్నారు. రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాలేదు.

ఉపాధి అవకాశాలు పెరగలేదు. ఆదాయ మార్గాలు పెరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 90 శాతం పైగా పథకాలను అప్పులతోనే నెట్టుకొస్తున్నారు. ఆ అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేస్తూ.. భారాన్ని ప్రజల నెత్తిన పడేస్తున్నారని అన్నారు.రాష్టంలో అరాచకం అప్పులు తప్ప ఎలాంటి పురోగతి లేదన్నారు.

రెండేళ్లలో జగన్ రెడ్డి చేసిన అప్పులు

2019-20లో చేసిన అప్పులు రూ.52,090.63 కోట్లు, 2020-21లో ఫిబ్రవరి వరకు అప్పులు రూ.79,191.58 కోట్లు, మొత్తం  అప్పులు 1,31,82.21 కోట్లు,బడ్జెట్ యేతర అప్పులు రూ.34,650 కోట్లు మొత్తం అప్పులు రూ. 1,65,932.21 కోట్లు అన్నారు.

ఈ లెక్కన జగన్ రెడ్డి సర్కారు ఏడాదికి సగటున రూ.82,966 కోట్ల అప్పు చేసింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏడాదికి సగటున రూ.26వేలు చొప్పున అప్పు చేయగా… జగన్ రెడ్డి ప్రభుత్వం ఏడాదికి సగటున రూ.80వేల చొప్పున అప్పులు చేసినట్లు పేర్కొన్నారు.

ఇంత అప్పులు చేస్తున్నా.. అభివృద్ధి మాత్రం శూన్యమని అప్పులు అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం రద్దు చేసిందని దీంతో అనేక వర్గాలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

బుడ‌తనాప‌ల్లి విద్యార్ధికి జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌ అవార్డు

Satyam NEWS

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘సుందరాంగుడు’ టైటిల్ సాంగ్ రిలీజ్

Bhavani

మీరు సలహాదారులా?  అధికార  ప్రతినిధులా ?

Satyam NEWS

Leave a Comment