38.2 C
Hyderabad
April 29, 2024 11: 10 AM
Slider శ్రీకాకుళం

పోక్సో కేసులో 20 ఏళ్ళు జైలు శిక్ష

#srikakulam

ఏడాది క్రితం విజయనగరం జిల్లా కేంద్రంలో అదీ విజయనగరం పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో నమోదైన ఫోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష విధించింది… విజయనగరం జిల్లా కోర్ట్. విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషనులో గతేడాది జూన్ 24న  నమోదైన పోక్సో కేసులో నిందితుడైన శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం మండలం పెద్దసీది కి చెందిన ధర్మాన ప్రసాద్ అలియాస్ రుషికుమార్ ( 20)కు 20 ఏళ్ళు జైలు,  20వేలు జరిమానా విధిస్తూ ప్రత్యేక పోక్సో న్యాయస్థానం శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించిందని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.

నిందితుడు ధర్మాన ప్రసాద్ అలియాస్ రుషికుమార్ (20) మైనరు బాలికపై లైంగిక నేరంకు పాల్పడడంతో విజయనగరం వన్ టౌన్  పోలీసు స్టేషనులో పోక్సో చట్టం యాక్టు ప్రకారం కేసును దిశ మహిళా పిఎస్ ఎస్ఐ కే.టి.ఆర్.లక్ష్మి కేసు నమోదు చేసారు. అనంతరం, గతంలో విజయనగరం మహిళా దిశా డిఎస్పీగా పని చేస టి.త్రినాధ్ దర్యాప్తు పూర్తి చేసి, నిందితుడిని అరెస్టు చేసి, కోర్ట్ లో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేందుకుగాను ప్రాధాన్యత కేసుల జాబితాలో చేర్చి, ప్రాసిక్యూషను త్వరతిగతిన పూర్తి చేసామన్నారు.

నిందితుడు ధర్మాన ప్రసాద్ అలియాస్ రుషి కుమార్ పై నేరం రుజువుకావడంతో స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు జడ్జి కె.నాగమణి నిందితుడికి ఇరవై ఏళ్ళు జైలు శిక్ష, 20వేలు జరిమాన విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. ఈ కేసులో పోలీసువారి తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటరు మావూరి శంకరరావు వాదనలు వినిపించగా, వన్ టౌన్  కోర్టు కానిస్టేబులు త్రినాధరావు, దిశ హెచ్ని దివ్యజ్యోతి సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపర్చారన్నారు. పోక్సో కేసులో త్వరితగతిన నిందితుడికి శిక్ష పడే విధంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించారు.

Related posts

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్ట్

Satyam NEWS

ఫ్యాక్ట్ ఫైండింగ్: అసత్య ప్రచారాలే ఢిల్లీ అల్లర్లకు కారణం

Satyam NEWS

జనతా కర్ఫ్యూ తుంగలో తొక్కిన సిర్పూర్ పేపర్ మిల్లు

Satyam NEWS

Leave a Comment