33.7 C
Hyderabad
April 29, 2024 00: 59 AM
Slider విజయనగరం

పోలీసు స్పందనలో బాధితుల గోడు…

#sp

ప్రతీ సోమవారం మాదిరిగానే ఈ వారం కూడా విజయనగరం జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ప్రజల సమస్యలను తెలుసుకునే”స్పందన” కార్యక్రమాన్ని జిల్లా పోలీసు బాస్ దీపికా తీసుకున్నారు. అయితే ఈ వారం “స్పందన”కు విజయనగరం పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని అత్యధిక మంది బాధితులు తమ ,తమ సమస్యలను పరిష్కరించాలని పోలీసు బాస్ ను వేడుకున్నారు.

అందులో విజయనగరం వన్ టౌన్ నుంచే ఎక్కువ మంది బాధితులు తమ సమస్యలను చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక  నిర్వహించారు. ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 31 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. తెర్లాం మండం లోచర్ల కు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ అదే గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద నుండి తన తండ్రి, భర్త 0.20 సెంట్లు భూమిని 2013లో క్రయపురోణి చేసుకున్నట్లు, అప్పటి నుండి సదరు భూమిని వారు సాగు చేస్తున్నట్లు ఇటీవల సదరు భూమిని వేరే వ్యక్తులకు సదరు అమ్మేసినట్లు, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేసి, భూ సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన రెవెన్యూ కమిటీ దృష్టికి తీసుకొని వెళ్ళి, సమస్య పరిష్కరించాలని తెర్లాం ఎస్ఐను ఆదేశించారు.

కొత్తవలస మండలం రాయపురాజుపేట  కి చెందిన వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన బంధువులు తరుచూ తనపై దాడులకు పాల్పడుతున్నారని, తనకు వారి నుండి రక్షణ కావాలని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని కొత్తవలస సిఐను ఆదేశించారు. విజయనగరం కు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్తతో వచ్చిన విభేదాలను పరిష్కరించేందుకు విజయనగరం పట్టణంకు చెందిన ఒక లాయరును ఆశ్రయించి, 1 లక్ష చెల్లించినట్లు, ఇప్పుడు తన భర్తతో రాజీ కుదిరి, ఇరువురు సక్రమంగా జీవిస్తున్నందున, తీసుకున్న ఫీజులో 70వేలు తిరిగి ఇవ్వాలని కోరినా, ఇవ్వడం లేనట్లు, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం వన్ టౌన్ సిఐను ఆదేశించారు. విజయనగరం కే.ఎల్.పురంకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ, తన ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒకామె చిట్టీలు పేరుతో తన వద్ద నుండి డబ్బులు వసూలు చేసి, చిట్టీలు పూర్తయినప్పటికీ, డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని వన్ టౌన్ సిఐను ఆదేశించారు.

విజయనగరం పట్టణంకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని, తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, ఈ విషయంలో నా అత్త కూడా సహకరిస్తున్నదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం టూటౌన్ సిఐను ఆదేశించారు.

గుర్ల మండలం చింతలపేట  కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు వారసత్వంగా మెంటాడ గ్రామంలో సంక్రమించిన భూమిని తన సోదరులు ఆక్రమించుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుప స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని గజపతినగరం సిఐను ఆదేశించారు.

ఇలా “స్పందన”లో స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, వారం రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్దీన్, ఎస్బీ సిఐలు కే.కే.వి.విజయనాధ్, ఈ. నర్సింహమూర్తి, డిసిఆర్బీ ఎస్ఐలు వాసుదేవ్, ప్రభావతి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

అభిమతం

Satyam NEWS

శ్రీశైలం మహా క్షేత్రంలో అసెంబ్లీ స్పీకర్

Satyam NEWS

LRS కట్ట వద్దని TPCC జాయింట్ సెక్రెటరీ అజీజ్ పాషా పిలుపు

Satyam NEWS

Leave a Comment