కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూను కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లోని కాగజ్నగర్ పట్టణం సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం నిర్వీర్యం చేసింది. ప్రతిరోజు లాగానే దాదాపు 2000 మంది కార్మికులకు ఆదివారం అయినా సెలవు ఇవ్వకుండా పనికి రమ్మని ఒత్తిడి తెచ్చింది.
ఫలితంగా ఇవాళ ఉదయం పూట రెండు వేల మంది కార్మికులు సిర్పూర్ పేపర్ మిల్లు లో పనికి వచ్చారు. దేశమంతా జనతా కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తే సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం మాత్రం మాకు ఎవరితో పని లేదు అన్నట్లు వ్యవహరిస్తోంది. మంత్రి కేటీఆర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ అండదండలు ఉన్నాయని చెప్పుకుంటూ యాజమాన్యం ఇలా ప్రవర్తించడం కొసమెరుపు. ఇది కేవలం కార్మికులను మాత్రమే హెల్త్ రిస్క్ లోకి నెట్టడం కాదు, మొత్తం పట్టణ ప్రజలకు ఈ వైరస్ సోకే ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే పెద్ద ఎత్తున గుమిగూడిన ప్రజలు వైరస్ వ్యాప్తికి సహకరించినట్లు అవుతుంది. ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.