26.7 C
Hyderabad
May 3, 2024 10: 28 AM
Slider సంపాదకీయం

వైసీపీలో 22 మందికి టిక్కెట్లు గల్లంతు?

#cm jagan

మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు ఆశించిన రీతిలో పని చేయడం లేదని ముఖ్యమంత్రి జగన్ చెప్పినా వాస్తవంగా ఆ సంఖ్య అంతకు మించే ఉందని అంటున్నారు. మొత్తం 60 మంది వరకూ మళ్లీ గెలిచే అవకాశాలు లేవనే వార్తలు ఒక్క సారిగా గుప్పుమనడంతో అధికార వైసీపీలో అలజడి మొదలైంది.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రారంభించిన తర్వాత జరిగిన తొలి సమీక్షలో 42 మంది ఆ కార్యక్రమంలో పాల్గొనడం లేదని జగన్ తేల్చి చెప్పారు. వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేది లేదని కూడా ఆయన కరాఖండిగా తేల్చి చెప్పారు. ఆ తర్వాతి కాలంలో తలెత్తిన అసమ్మతితో వెనక్కు తగ్గిన జగన్ ఇప్పుడు 18 మంది ఆశించిన రీతిలో పని చేయడం లేదని చెబుతున్నారు.

గతంలో ఎవరు పని చేయడంలేదో పేర్లతో సహా చెప్పిన జగన్ ఈ సారి మాత్రం 18 సంఖ్య మాత్రమే చెప్పి ఊరుకున్నారు తప్ప ఎవరి పేరు చెప్పలేదు. వాస్తవానికి ఈ సంఖ్య 22 మంది వరకూ ఉన్నదని అంటున్నారు… ఈ 22 మందికి రాబోయే ఎన్నికలలో వైసీపీ టిక్కెట్ వచ్చే అవకాశం లేదని కూడా చర్చలు జరుగుతున్నాయి. జగన్ ఈ పేర్లను బయటకు చెప్పకపోయినా కూడా పార్టీలో అంతర్గతంగా ఈ పేర్లపై చర్చలు జరుగుతున్నాయి…

రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ టిక్కెట్లు నిరాకరించే వారి పేర్లు బయటకు వచ్చాయి. ఈ పేర్లపై జరుగుతున్న చర్చలు కూడా ఆసక్తికరంగా మారాయి. ఈ 22 మందికి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ పేర్లు ఈ విధంగా ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి చూస్తే వివిధ కారణాలతో ఈ సారి టిక్కెట్ దక్కని ఎమ్మెల్యేల జాబితాలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్ కె ఉన్నారు.

ఆయనతో బాటు తీవ్ర అసమ్మతి ఎదుర్కొంటున్న పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య ఉన్నారు. ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శ్రీదేవికి ఎటూ టిక్కెట్ వచ్చే అవకాశం లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే మొండి తోక జగన్ మోహన్ రావు పనితీరు బాగాలేకపోవడంతో ఈ సారి ఆయనకు టిక్కెట్ ఇచ్చేది లేదని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతున్నది. ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మాది శెట్టి వేణుగోపాల్, సంత నూతల పాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు లకు కూడా ఈ సారి వైసీపీ టిక్కెట్ వచ్చే అవకాశం లేదు.

నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఇప్పటికే తిరుగుబాటు చేయగా ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. దాంతో ఆయనకు టిక్కెట్ వచ్చే అవకాశం లేదు. ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.

అదే విధంగా తిరుగుబాటు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి…. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్ర శేఖరరెడ్డి లను కూడా పార్టీ సస్పెండ్ చేసింది. అదే విధంగా ఇంకా పార్టీలోనే ఉన్న గూడూరు ఎమ్మెల్యే వి.ప్రసాద రావుకు ఈ సారిటి టిక్కెట్ వచ్చే అవకాశం లేదు.

చిత్తూరు జిల్లా పూతల పట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డికి ఈ సారి టిక్కెట్ ఇవ్వరాదని వైసీపీ అగ్రనేతలు భావిస్తున్నారని తెలిసింది… ఈ సారి పోటీ చేసేందుకు ఆయన కూడా విముఖంగా ఉన్నారని… ఆయన స్థానంలో ఆయన కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో కరుణాకర్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధకు ఈ సారి టిక్కెట్ రావడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ఉషశ్రీ చరణ్ కు ఈ సారి పార్టీ టిక్కెట్ ఇవ్వడం లేదు…. అదే విధంగా పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ్ కూడా హిట్ లిస్టులో ఉన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే టీ.ఆర్థర్ కు ఈ సారి టిక్కెట్ ఇవ్వడంలేదు. పశ్చిమ గోదావరి ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, చింతల పూడి.. ఎలీషా కూడా హిట్ లిస్టులో ఉన్నారు.

తూర్పు గోదావరి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పి.పూర్ణ చంద్ర ప్రసాద్, విశాఖపట్నం జిల్లా భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ లకు ఈ సారి టిక్కెట్ హుళక్కే అంటున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన అప్పల నాయుడు, శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పాయకరావు పేట ఎమ్మెల్యే జి. కిరణ్ కుమార్ తాజా హిట్ లిస్టులో ఉన్నారు.

Related posts

మద్నూర్ లో ఆధ్యాత్మిక దినోత్సవం

Satyam NEWS

Shocking News: పాలమూరు జిల్లా బిజెపి అధ్యక్షుడు రాజీనామా

Satyam NEWS

పంచాయ‌తీ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా జ‌ర‌గాలి

Satyam NEWS

Leave a Comment