37.2 C
Hyderabad
May 2, 2024 13: 12 PM
Slider నల్గొండ

32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ

#RoadSeafty

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో నేడు 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరిగాయి. జనవరి 18  నుండి ఫిబ్రవరి 17 వరకు మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ కార్యక్రమంలో హుజూర్ నగర్ సి.ఐ రాఘవరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా CI రాఘవరావు మాట్లాడుతూ వాహనదారులు అతివేగంతో నడపడం మంచిది కాదని, తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని అన్నారు. హెల్మెట్ పెట్టు కోకుండా  వాహనం నడపడం ప్రమాదకరమని ఆయన అన్నారు.

వాహన సామర్థ్యానికి మించిన అధిక బరువుతో వాహనం నడపడం చట్టరీత్యా నేరమని, త్రిబుల్ రైడింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, మైనర్ పిల్లల డ్రైవింగ్, బైక్ రేసింగ్, బెట్టింగుల ప్రయత్నాలు చేయకూడదు అన్నారు.

ఎక్కడపడితే అక్కడ వాహనాన్ని రోడ్డు దాటించడం, రోడ్లమీద పార్కింగ్ చేయటం, వాహనదారులకు శ్రేయస్కరం కాదని, పోలీసు వారికి సహకరించి జాగ్రత్తగా బండి నడుపుతూ ప్రమాదాల నుండి సురక్షితంగా ఉండి కుటుంబాలకు ఆసరాగా నిలవాలని కోరారు. అనంతరం ఆయన వాహనదారులతో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.

ప్రతిజ్ఞ

బాధ్యత గల భారతదేశ పారుడనైన నేను వాహనాన్ని  వేగంగా నడుపనని,మధ్యం సేవించనని, వాహనంపై అధిక బరువు వేయనని, ఎక్కడ పడితే అక్కడ వాహనాన్ని రోడ్డు దాటించనని, పార్కింగ్ చేయనని, ఇతరులకు ఇబ్బంది కలిగించనని, హెల్ల్మెట్ ధరించి వాహనం నడుపుతామని,  అన్ని అనుమతులతో  జాగ్రత్తగా వాహనాన్ని నడుపుతాము అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకట్ రెడ్డి, పోలీసు సిబ్బంది , ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఖాకీ ల సమక్షంలో నే మా వాళ్లపై దాడి జరిగింది

Satyam NEWS

Analysis: అభ్యర్ధులపై వ్యతిరేకత వల్లే తక్కువ శాతం ఓటింగ్

Satyam NEWS

ఉప్పల్ లో బండారి లక్ష్మారెడ్డి గెలుపు ఖాయం

Satyam NEWS

Leave a Comment