31.7 C
Hyderabad
May 2, 2024 10: 43 AM
Slider ఖమ్మం

33 మంది మిలీషియా సభ్యుల లొంగుబాటు

Milisia 33 Surendered

నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ చర్ల మండలం బత్తినపల్లి కష్టారంపాడు గ్రామాలకు చెందిన 33 మంది మిలిషియా సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం పోలీసు, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ సమక్షంలో లొంగిపోయారు.

పెద్ద సంఖ్యలో మావోలు స్వచ్ఛందంగా భద్రాద్రి జిల్లా ఎస్పీ కార్యాలయంలో లొంగిపోవ‌డం వెనుక అధికారులు చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించిన‌ట్లే చెప్పుకోవాలి. నూతనంగా జిల్లా ఏర్పడిన నాటినుండి ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టు మిలిషియా స‌భ్యులు లొంగిపోడం ఇదే ప్ర‌ప్ర‌థ‌మం.

33 మంది సభ్యులు మావోయిస్టు మిలీషియా, గ్రామ కమిటీ సభ్యులుగా పని చేశారు. వీరు మావోయిస్ట్ పార్టీ చర్ల ఏరియా కమిటీ సెక్రటరీ అరుణ కోసం పని చేశారు. గత రెండు సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో పని చేశారు. వీరిలో నలుగురు మావోయిస్టు కమిటీ సభ్యులు కాగా, మిగిలిన 29 మంది మిలీషియా సభ్యులు వున్నారు. ఇందులో కొందరు మిలిషియా సభ్యులు పెద్దమిడిసిలెరు రడ్ బ్లాస్టింగ్, కలిపేరు మందుపాతరలను అమర్చిన ఘటన, తిప్పాపురం వద్ద రోడ్ రోలర్, జెసిబి లను తగలబెట్టిన ఘటనలలో నిందితులుగా ఉన్నారు.

Related posts

ఈటల రాజేందర్ ప్రత్యర్థి ఇప్పుడు ఇక టీఆర్ఎస్ లోకి..?

Satyam NEWS

తెలంగాణలో వ్యవసాయం కు పెద్దపీట

Bhavani

ప్ర‌పంచంలోనే అత్యంత ఎక్కువ రాబడి ఉన్న చర్చి ఏదో తెలుసా?

Satyam NEWS

Leave a Comment