40.2 C
Hyderabad
April 26, 2024 14: 57 PM
Slider

ప్ర‌పంచంలోనే అత్యంత ఎక్కువ రాబడి ఉన్న చర్చి ఏదో తెలుసా?

#St.PeetersBasilicaChurch

రోమ్ – సెయింట్ పీట‌ర్స్ బాసిలికా చ‌ర్చి ప్ర‌పంచంలోనే అత్యంత పెద్ద‌ది. ఈ చ‌ర్చికి సెయింట్ పిట‌ర్స్ బాసిలికా చ‌ర్చి అనే పేరు కూడా ఉంది.

ఈ చ‌ర్చి వాటికన్‌ సిటిలో ఉంది. రెండో జూలియస్‌ 1506 లో ఈ చ‌ర్చి నిర్మాణం ప్రారంభించాడు.

అనేక ఒడిదుడుకుల మ‌ధ్య చ‌ర్చి 1615 పాల్‌.వి. రాజు కాలంలో చ‌ర్చి నిర్మాణం పూర్తి అయ్యింది. మూడు ఎత్తైన బలిపీఠాలపై నుంచి నేరుగా క్రాసింగ్ వద్ద ఉన్న పెద్ద గోపురాన్నికలుపుతూ ఈ చర్చిని నిర్మించారు.

కాథలిక్ సంప్రదాయంలో ఏసు పన్నెండు అపొస్తలులలో ఒకడైన సెయింట్‌ పీటర్ శ్మశానవాటికగా దీన్ని భావిస్తారు.

ఆయన సెయింట్ పీటర్ రోమ్ మొదటి బిషప్ అని, గ్రంథాల‌లో క్రీ.శ. 1వ శతాబ్దంలోని రోమన్‌ క్రైస్తవులు అపొస్తలుడైన పేతురు(సెయింట్‌ పీటర్‌) రోమ్‌కు వెళ్లాడని బైబిల్‌లో పేర్కొన్నారు.

పీటర్ చనిపోయిన తరువాత ఆయన మృతదేహాన్ని బాసిలికాలోని స్మశానవాటికలో ఖననం చేశారని నమ్మకం. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చ‌ర్చికి అత్యంత ఎక్కువ మొత్తంలో డ‌బ్బు స‌మ‌కూర‌డం విశేషం.

ప్ర‌పంచంలో ఎక్కువ మొత్తంలో కానుక‌లు, డ‌బ్బులు స‌మ‌కూరే మందిరాలు ఎవైనా ఉన్నాయంటే అందులో మొద‌టిది రోమ్ చ‌ర్చి అని చెబుతారు.

Related posts

శ్రీకాకుళం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

Satyam NEWS

3 సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నాం ప్రధాని ప్రకటన

Sub Editor

గ్రామ గ్రామానా ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేద్దాం

Satyam NEWS

Leave a Comment