40.2 C
Hyderabad
April 29, 2024 18: 01 PM
Slider కడప

ఈత కోసం దిగి ఇద్దరు చిన్నారులు మృతి

2 childs

కార్తీక సోమవారం కోసం ఆలయానికి వెళ్లి, సిద్దవటం పెన్నా నదిలో ఈత కోసం దిగి ఇద్దరు చిన్నారుల మృతి చెందగా, ఈతగాళ్ళు మృత దేహాలను వెలికి తీశారు.

కడప జిల్లా సిద్ధవటం గ్రామం ఆకుల వీధికి చెందిన అతికారి వెంకటరత్నం, అతికారి రవిశంకర్ అనే అన్నదమ్ముల కుమారులైన శ్రావణ్ కుమార్, లాసిత్లు సోమవారం ఆకుల వీధి సమీపాన గల పెన్నానది మడుగులో పడి మృత్యువాత పడ్డారు.

కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి పెన్నానది వద్దకు వెళ్లి మ్రొక్కుబడి తీర్చుకునే క్రమంలో నలుగురు చిన్నారులు సరదా కోసం నదిలోకి వెళ్లారు. ఐతే ముందుగా వెళ్లన శ్రావణ్ కుమార్, లాసిత్ లు మడుగులో పడి మునిగిపోయారు. ఇది గమనించిన వారి పెద్దమ్మ వెంటనే వెనుక వెళ్తున్నఇద్దరు చిన్నారులను మడుగులోకి వెళ్లకుండా ప్రాణాపాయం నుండి కాపాడిండి.

మృతి చెందిన శ్రావణ్ కుమార్, లాసిత్ లను సిద్దవటం పోలీస్ లు యానాదుల సహాయంతో గాలించి బయటకు తీశారు. చిన్నారులు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి ఒంటిమిట్ట సి ఐ హనుమంతు నాయక్ చేరుకుని జరిగిన సంఘటనపై ఆరా తీసి కేసు నమోదు చేశారు.

Related posts

క్రాప్ ఆర్డర్: ప్రభుత్వం చెప్పిన పంటలనే వేయాలి

Satyam NEWS

ఇంట్లోనే ఉండండి రంజాన్ పాటించండి

Satyam NEWS

తెనాలిలో గంజాయి మొక్కల కలకలం

Bhavani

Leave a Comment