40.2 C
Hyderabad
April 26, 2024 11: 06 AM
Slider ప్రత్యేకం

కృష్ణా నదిలో పుట్టి మునక తో నలుగురు గల్లంతు

#Krishna River

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పంచదేవపహాడ్ నుంచి కర్ణాటకలోని కురువపురం వెళ్తున్న పుట్టి కృష్ణా నదిలో మునిగింది. పుట్టి లో పదిహేను మంది ఉన్నట్లు సమాచారం. 11 క్షేమంగా కర్ణాటక వైపు చేరుకొనగా… ముగ్గురు మహిళలు, ఓ బాలిక నదిలో గల్లంతైనట్లు సమాచారం.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కృష్ణా నది మధ్యలో ఉండే కురుమపురం కర్ణాటక రాష్ట్ర పరిధిలో ఉంటుంది. కురుమ పురానికి చెందిన 15 మంది నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు మక్తల్ మండలం పంచదేవపహాడ్ వచ్చి తిరిగి స్వగ్రామం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

కర్నాటక రాష్ట్ర, పెద్ద కూర్మం గ్రామంకు చెందిన 13 మంది గ్రామస్తులు తెలంగాణ రాష్ట్రంలోని పసుపుల గ్రామం, నారాయనపేట్ జిల్లా కు తెప్ప మీద వచ్చే  క్రమంలో భారీ వర్షాల కారణంగా, నీటి ప్రవాహం అధికంగా వుండడంతో తెప్ప తిరగబడ్డది.

అక్కడే వున్న తెలంగాణ మత్స్యకారులు శ్రీపాద, ఆది, లింగమ్మ, నర్సింహులు అందులోని 9 మందిని రక్షించారు. అంజిలప్ప, దలపతి, నాగప్ప, బుద్దన్న, తిమ్మన్న, నాగేశ్, మోహన్, విష్ణు, అంజిలమ్మలను  సురక్షితంగా రక్షించగా మిగతా నలుగురు సుమలత (9), రోజా (24), చిన్నక్క (35) యు నర్సమ్మ (28) గల్లంతు అయ్యారు.

సమాచారం అందుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాకు చెందిన కలెక్టర్, SP, స్థానిక MLA శివరాజ్ పాటిల్ తో మాట్లాడారు. NDRF సహాయంతో జిల్లా కలెక్టర్, SP, RDO, ఉన్నతాధికారులందరూ గల్లంతైన మిగతా నలుగురిని రక్షించడానికి గాలింపు చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు.

Related posts

జెబిఎస్-ఫలక్ నుమా మెట్రో కారిడార్‌లో ట్రయల్ రన్

Satyam NEWS

విజయనగరంలో రెడ్ క్రాస్ సొసైటీ వందేళ్ల పండుగ

Satyam NEWS

క్రీడలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం

Bhavani

Leave a Comment