29.7 C
Hyderabad
May 1, 2024 04: 21 AM
Slider ఖమ్మం

క్రీడలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం

#Minister Puvvada Ajay Kumar

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసి, క్రీడా సౌకర్యాలను మెరుగుపర్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సర్దార్ పటేల్ స్టేడియం నందు జరిగిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. క్రీడారంగంలో మన దేశ ప్రతిష్టను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళిన క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం వస్తుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి, ప్రతి క్రీడా ప్రాంగణంలో వివిధ ఆటల కిట్లు 1 సెప్టెంబర్ నుండి అందుబాటులోకి తెస్తుందన్నారు. గత 9 సంవత్సరాల్లో సర్దార్ పటేల్ స్టేడియాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. రూ. 1.20 కోట్లతో ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం, రూ. 27 లక్షలతో వాలీబాల్, అథ్లెటిక్ ట్రాక్ లకు ఫెన్సింగ్, రూ. 70

లక్షలతో జిమ్నాస్టిక్ ఇండోర్ స్టేడియం, రూ. 8.60 లక్షలతో ఆర్చరీ క్రీడా ప్రాంగణం, రూ. 5 లక్షలతో ఓపెన్ జిమ్, రూ. 20 లక్షలతో ఫ్లడ్ లైట్లు, రూ. 12 లక్షలతో మినీ స్విమ్మింగ్ పూల్, రూ. 93 లక్షలతో అధునాతన ప్రపంచ స్థాయి మూడు సింథటిక్ టెన్నిస్ కోర్టులు, రూ. 26 లక్షలతో సింథటిక్ స్కెటింగ్ రింగ్, రూ. 1.50 కోట్లతో పెవిలియన్ గ్రౌండ్ లో వుడెన్ బాస్కెట్ బాల్ కోర్ట్, రూ. 2.50 కోట్లతో వైరా ఇండోర్ స్టేడియం, రూ. 3.40 కోట్లతో కల్లూరు మినీ స్టేడియం, రూ. 2.65 కోట్లతో మధిర మినీ స్టేడియం లు ఏర్పాటుచేసినట్లు మంత్రి అన్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకొని క్రీడాకారులు రాణించాలని, జిల్లాకు గొప్ప పేరు తేవాలని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, హాకీలో దేశాన్ని ఉన్నత స్థానంలో నిలిపిన మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడల దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. రెజ్లింగ్, అథ్లెటిక్, ఆర్చరీ, జిమ్నాస్టిక్ లాంటి వ్యక్తిగత క్రీడల్లో రాణిస్తే ఎక్కువ మెడల్స్ వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.

విద్యాశాఖ లోని పిఇటి లు శ్రద్ద పెట్టి గ్రాస్ రూట్ లో పిల్లల ప్రతిభను గుర్తించాలన్నారు. చిన్న వయసులో ప్రతిభ గుర్తిస్తే, వారిని మంచిగా తీర్చిదిద్దవచ్చని ఆయన తెలిపారు. జిల్లాలో 545 క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేసినట్లు, అన్ని క్రీడా ప్రాoగణాల్లో కిట్స్ అందుబాటులో ఉంచుతున్నట్లు, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో మినీ స్టేడియంలు నిర్మించుకున్నట్లు ఆయన అన్నారు.

జిల్లా జనాభా 16 లక్షలు ఉన్నట్లు, జమైకా దేశ జనాభా తో సమానమని, జమైకాలో ఉసేన్ బోల్ట్ క్రీడల్లో రాణించి, ఎన్నో పతకాలు సాధించారని, ఖమ్మం లో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే క్రీడాకారులు తయారవ్వాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్ మాట్లాడుతూ, క్రీడలను ప్రోత్సహించే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమని అన్నారు. గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు, నియోజకవర్గ స్థాయిలో స్టేడియంల నిర్మాణాలు చేసినట్లు ఆయన తెలిపారు. మధిరలో నిర్మించిన స్టేడియం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన అన్నారు.

కార్యక్రమంలో మంత్రి జిల్లాలో క్రీడలకు విశిష్ట సేవలు అందించిన కోచ్ లు, క్రీడల్లో రాణించిన క్రీడాకారులను సత్కరించి, మెమొంటో లను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా క్రీడల అధికారి సునీల్ రెడ్డి, నగర కార్పొరేటర్లు, అధికారులు, క్రీడా సంఘాల బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

విమాన సర్వీసుల రద్దు పొడిగింపు

Sub Editor

డాన్ బాస్కో పిల్లలకు బ్లాంకెట్లు పంపిణీ

Bhavani

కొంగ్రొత్త ఆశల ఉగాది

Satyam NEWS

Leave a Comment