27.7 C
Hyderabad
April 26, 2024 05: 29 AM
Slider గుంటూరు

జగనన్న కాలనీ ఇళ్ళకి 5లక్షల రూపాయలు ఇవ్వాలి

#JaganannaColony

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ ఇళ్ళ నిర్మాణానికి ఒక్కొక్క ఇంటికి రు.5 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు అన్నారు. స్దానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో జగనన్న కాలనీలకు మౌలిక సదుపాయాల కల్పించాలంటూ ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చి పట్టణాలలో సెంటు, గ్రామాలలో సెంటున్నర ఇవ్వడం జరిగిందని అన్నారు. స్ధలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఆర్దికతోడ్పాటునందిస్తామని ముఖ్య మంత్రి జగన్ చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయని అన్నారు.

ప్రభుత్వం ఇచ్చే 1.80 లక్షల రూపాయలు సరిపోక జగనన్న కాలనీలలో ఇళ్ళు నిర్మాణానికి నోచుకోకపోవటంతో లబ్దిదారులు అల్లాడిపోతున్నారని అన్నారు. ఇళ్ళు నిర్మించుకోకపోతే స్దలాలు స్వాధీనం చేసుకుంటామని అధికారులు బెదిరిస్తున్నారని అన్నారు. వారికి సిపిఐ వెన్నుదన్నుగా ఉంటుందని అన్నారు. ఈ నెల 31 నాటికి లబ్దిదారులకు 5లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనవరి నెలలో సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులను, మంత్రులను ఘెరావ్ చేసి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. తొలుత స్థానిక చెరువుకట్ట సెంటర్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి చక్రవరం సత్యనారాయణరాజు, సిపిఐ నరసరావుపేట పట్టణ కార్యదర్శి వైదన వెంకట్, ఎఐవైఫ్ జిల్లా కన్వీనర్ షేక్ సుభానీ, సిపిఐ మండల నాయకులు అంజిరెడ్డి, అచ్యుత్ రెడ్డి, నాగరాజు, సురేష్, జమ్ములమూడి వెంకటేశ్వర్లు, నిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

మాదిరాజు రామ్మూర్తి, సత్యంన్యూస్.నెట్

Related posts

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను సాధిద్దాం

Satyam NEWS

సుప్రసిద్ధ కళా దర్శకులు ఆనంద సాయికి పవన్ కల్యాణ్ అభినందన

Satyam NEWS

నెట్‌అకాడ్ రైడర్స్‌ ఇండియా ఛాంపియన్‌గా భాషిత 

Satyam NEWS

Leave a Comment