33.7 C
Hyderabad
April 28, 2024 00: 18 AM
Slider ఖమ్మం

స్వచ్ఛ సర్వేక్షణ్‌ లో ఖమ్మం ఫస్ట్

#khammam

స్వచ్ఛసర్వేక్షణ్‌ లో దేశంలోనే ఖమ్మంకు  ఫస్ట్‌ ప్లేస్ దక్కటం పట్ల స్థానిక ఎమ్మేల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ ర్యాంకింగుల్లో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలు సత్తాచాటాయని అన్నారు. కేంద్ర జలశక్తి శాఖ దేశవ్యాప్తంగా మొత్తం 44పట్టణాలకు త్రీస్టార్‌ రేటింగ్‌ ఇవ్వగా.. అందులో 187.35శాతం మార్కులతో ఖమ్మం జిల్లా దేశంలోనే మొదటిస్థానాన్ని కైవసం చేసుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు.122.57మార్కులతో భద్రాద్రి జిల్లా ఐదోస్థానంలో నిలిచిందని, స్వచ్ఛసర్వేక్షణ్‌లో ఖమ్మం జిల్లాకు ప్రథమస్థానం రావడం పట్ల జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామ పంచాయతీల నిర్వహణలో ఖమ్మం జిల్లా దేశంలోనే ఆదర్శంగా నిలవడం గర్వంగా ఉందన్నారు. గతేడాది డిసెంబరు 1వ తేదీ వరకు ఉన్న గణాంకాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం 2023 స్వచ్ఛసర్వేక్షణ్‌ ర్యాంకులను  ప్రకటించింన నేపద్యంలో ఖమ్మం కు చోటు దక్కడం అధికారులు, సిబ్బంది కృషి పట్ల మంత్రి వారిని అభినందించారు.

Related posts

కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌పై సీబీఐటీలో కార్యక్రమం

Satyam NEWS

హత్యకు వివాహేతర సంబంధమే కారణమా?

Sub Editor

పేదలకు నిత్యావసరాలు పంచిన మహేంద్ర సంఘం

Satyam NEWS

Leave a Comment