వివాహం జరిగి ఆరు నెలలు కాకముందే ఓ భర్త తన భార్యను తుపాకితో ఏడు సార్లు కాల్చి అనంతరం తనకు తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బీహార్‌లోని సీతామర్హి లో చోటుచేసుకుంది. చంద్రభూషణ్ పాండే క్విక్ రెస్పాన్స్ టీమ్ జవాన్‌గా పనిచేస్తున్నాడు. భార్య భర్తలమధ్య వాగ్వాదం జరుగగా చంద్రభూషణ్ భార్య మధును తుపాకీతో ఏడు సార్లు కాల్చి ఆపై తానూ కాల్చుకొని ఆత్మహత్యకు చేసుకున్నాడు.
పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టమ్‌కు తరలించి కేసు నమోదు చేశారు. కాల్పులకు కారణం కుటుంబ కలహాలా లేక మరేదైనా అనే కోణం లో ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అంశం పై దర్యాప్తు నిర్వహించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.