అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 27 & 28, సదర్మట్ బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లోబయలుదేరి పొన్కల్ వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్మట్ బ్యారేజీ వద్దకు ఉదయం 10.15 గంటలకు చేరుకున్నారు.
అక్కడ క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించారు. అనంతరం కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు ప్రాజెక్టులను, కాళేశ్వరం ప్యాకేజీ – 27, 28 పనులు సాగే తీరును స్వయంగా ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలో నీటిపారుదల శాఖ అధికారులతో సదర్మాట్ బ్యారేజీ, కాళేశ్వరం ప్యాకేజీ – 27, 28, మిషన్ భగీరథ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి అధికారులతో చర్చించడం వల్ల పనులు మరింత వేగవంతంగా పూర్తి అయ్యే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టులను గడువు లోపు పూర్తి చేసేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కృషి చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా రైతాంగానికి గోదావరి జలాలు సకాలంలో అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, ఆర్ డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.