31.7 C
Hyderabad
May 2, 2024 09: 18 AM
Slider జాతీయం

ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్

#kudligimla

అసెంబ్లీ ఎన్నికల ముందు కర్ణాటకలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి షాక్ తగిలింది. కుడ్లిగి నియోజకవర్గం నుండి బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్‌వై గోపాలకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఇటీవలే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్సీలు (పుట్టన్న, బాబురావు చించన్‌సూర్‌) రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. అదేవిధంగా జేడీ(ఎస్) ఎమ్మెల్యే ఎస్. ఆర్. శ్రీనివాస్ కూడా రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.

మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువురు బీజేపీ, జనతాదళ్ (ఏఎస్) ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని, ఇది ప్రజల అభీష్టానికి నిదర్శనమని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సోమవారం అన్నారు. కుడ్లిగి నియోజకవర్గం నుండి బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్‌వై గోపాలకృష్ణను పార్టీలో చేర్చుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

గత శుక్రవారం నాడు గోపాలకృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. శివకుమార్ మాట్లాడుతూ, “బిజెపి, జెడి (ఎస్) నాయకులు చాలా మంది మా తలుపులు తడుతున్నారు. రాష్ట్ర ప్రజల గొంతు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. అధికారం వైపు కాంగ్రెస్ సాగుతున్నదనడానికి ఇదే నిదర్శనం అని ఆయన అన్నారు. అదేవిధంగా జేడీ(ఎస్) ఎమ్మెల్యే కె. ఎం.శివలింగేగౌడ కూడా రాజీనామా చేయగా త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారు.

బీజేపీ, జేడీ(ఎస్) నేతలు స్వచ్ఛందంగా కాంగ్రెస్‌లో చేరడం, ‘డబుల్ ఇంజన్ ప్రభుత్వం వైఫల్యం’ కారణంగా ప్రజలు మారాలని నిర్ణయించుకున్నారనే దానికి ‘పెద్ద నిదర్శనం’ అని కేపీసీసీ చీఫ్ చెప్పారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోపాలకృష్ణ గతంలో కాంగ్రెస్‌లో ఉన్నారు. చిత్రదుర్గ జిల్లాలోని మొలకల్మూరు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు, బళ్లారి నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీలో చేరిన తర్వాత కుడ్లిగి నుంచి ఎమ్మెల్యే అయ్యారు.

Related posts

వైజాగ్ ఎలర్ట్: అల్లిపురాన్ని జల్లెడపడుతున్న సిబ్బంది

Satyam NEWS

“కలివీరుడు” ట్రైలర్ విడుదల

Bhavani

కాంట్రాక్టు కార్మికులను తీసేసిన తిరుమల దేవస్థానం

Satyam NEWS

Leave a Comment