33.7 C
Hyderabad
April 29, 2024 02: 23 AM
Slider విజయనగరం

30న విజయనగరం జిల్లాలో 1.07 ల‌క్ష‌ల మందికి ఇళ్లు, ఇళ్ల‌పట్టాల పంపిణీ

#MinisterBotsa

ఈనెల 30న జిల్లాలో జ‌రిగే రాష్ట్ర సీఎం జగన్ ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేయాల‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పిలుపు ఇచ్చారు.

పేదలంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం ద్వారా ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని, దీనిలో భాగంగా ఈనెల 30న సీఎం గుంక‌లాంలో పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించేందుకు వ‌స్తున్న‌ట్టు చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా 30 ల‌క్ష‌ల మందికి ఇళ్లు, ఇళ్ల‌స్థ‌లాలు పంపిణీ చేయ‌నున్నామ‌ని చెప్పారు. గ‌తంలో డా.వైఎస్సార్ సీఎంగా వున్న సమయంలో లో ఉమ్మ‌డి రాష్ట్రంలో 24 ల‌క్ష‌ల ఇళ్ల‌ను ఇందిర‌మ్మ ప‌థ‌కంలో నిర్మించామ‌ని, ఆ త‌ర్వాత ఇంత పెద్ద ఎత్తున ఈ కార్య‌క్ర‌మాన్ని సీఎం జగన్ నేతృత్వంలో నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు.

సిఎం పర్యటనకు పకడ్బంది ఏర్పాట్లు

సీఎం ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌పై ప‌రిశీల‌న నిమిత్తం మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ రూర‌ల్ మండ‌లం గుంక‌లాంలో సి.ఎం. కార్య‌క్ర‌మాల స‌మ‌న్వ‌య‌క‌ర్త త‌ల‌శిల ర‌ఘురాం, ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామితో క‌ల‌సి ప‌ర్య‌టించారు. జిల్లా క‌లెక్ట‌ర్  డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ వారికి ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు చేస్తున్న ఏర్పాట్ల‌పై వివ‌రించారు.

అనంత‌రం క‌లెక్ట‌ర్ కార్యాల‌య స‌మావేశ మందిరంలో మంత్రి జిల్లా అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మై ఏర్పాట్ల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ జిల్లాలో జిల్లాలో 1,07,181 మందికి ఇళ్ల పట్టాలు, ఇళ్లు, ఇళ్ల స్థ‌లాల‌కు సంబంధించి పొజిష‌న్ ప‌త్రాలు అంద‌జేయ‌నున్నట్టు పేర్కొన్నారు.

ఇందులో 71,237 మందికి కొత్త‌గా ప‌ట్టాలు ఇస్తున్నామ‌ని, ప్ర‌భుత్వ స్థ‌లాల్లో ఇళ్లు నిర్మించుకొని నివ‌సిస్తున్న 24,237 మందికి పొజిష‌న్ స‌ర్టిఫికెట్లు అందించ‌నున్నామ‌ని, టిడ్కో ఇళ్ల‌ను కూడా అంద‌జేయ‌నున్నట్టు తెలిపారు. ఒక్క గుంక‌లాంలోనే 10 వేల మందికి ఇళ్ల‌ప‌ట్టాలు మంజూరు చేస్తూ కొత్త‌గా అక్క‌డ ఒక టౌన్ షిప్‌నే నిర్మిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

జనవరి 7వ తేదీ వరకూ పంపిణీ కార్యక్రమాలు

జిల్లా వ్యాప్తంగా వ‌చ్చే జ‌న‌వ‌రి 7వ తేదీ వ‌ర‌కు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతాయ‌ని పేర్కొన్నారు. గుంక‌లాంలో పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు సీఎం ఉద‌యం 11 గంట‌ల ప్రాంతంలో హెలికాప్ట‌ర్‌లో చేరుకోనున్నార‌ని, దాదాపు రెండు గంట‌ల పాటు ఇక్క‌డ జ‌రిగే కార్య‌క్ర‌మంలో పాల్గొంటార‌ని వెల్ల‌డించారు.

 సీఎం ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చే ల‌బ్దిదారుల‌కు గాని, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు గానీ ఇబ్బందులు లేకుండా చూసే బాధ్య‌త అధికారుల‌పై వుంద‌న్నారు. ముఖ్యంగా పోలీసులు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి ఎటువంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కాకుండా చూడాల‌న్నారు.

జాతీయ ర‌హ‌దారి నుండి స‌భాస్థ‌లికి చేరుకొనేందుకు వుండే అన్ని మార్గాల‌ను వాహ‌నాల రాక‌పోక‌ల‌కు వీలుగా మ‌ర‌మ్మ‌త్తులు చేప‌ట్టాల‌ని పంచాయ‌తీరాజ్ శాఖ ప‌ర్య‌వేక్ష‌క ఇంజనీర్‌ను మంత్రి ఆదేశించారు. నగరంలోని ఇళ్ల‌స్థ‌లాల ల‌బ్దిదారులు స‌భాస్థ‌లికి చేరుకొనేందుకు వీలుగా అవ‌స‌ర‌మైన బ‌స్సుల‌ను ఆర్టీసీ నుండి స‌మ‌కూర్చాల‌ని ప్రాంతీయ మేనేజ‌ర్‌ను మంత్రి ఆదేశించారు.

జిల్లా అధికారులంతా త‌మ‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌లు స‌క్ర‌మంగా, స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హిస్తూ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌పై వివ‌రిస్తూ గుంక‌లాంలో 12,301 మందికి ఇళ్ల‌ప‌ట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలిపారు.

టిడ్కో నివాస గృహాలను కూడా పంపిణీ చేస్తున్నాం

విజ‌య‌న‌గ‌రం ప‌రిధిలోని ఇళ్లులేని నిరుపేద‌ల‌కు ఇక్క‌డ ఇళ్ల స్థ‌లాలు మంజూరు చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 75 వేల మందికి ఇళ్ల‌స్థ‌లాలు, 8 వేల మందికి టిడ్కో ఇళ్ల‌ను పంపిణీ చేయ‌నున్నామ‌ని చెప్పారు. సీఎం ప‌ర్య‌ట‌న కార్య‌క్ర‌మం కోసం స‌భా ప్రాంగ‌ణంలో మూడు పార్కింగ్ ప్ర‌దేశాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని, ప్ర‌ముఖుల వాహ‌నాల‌కోసం, ఇళ్ల‌స్థ‌లాల ల‌బ్దిదారుల‌ను తీసుకువ‌చ్చే వాహ‌నాల‌కోసం వేర్వేరుగా పార్కింగ్ ప్ర‌దేశాలు ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు.

ల‌బ్దిదారులు వాహ‌నం దిగిన త‌ర్వాత ఎక్కువ దూరం న‌డ‌వ‌కుండా స‌భా ప్రాంగ‌ణానికి సమీపం వ‌ర‌కు వ‌చ్చేలా ఏర్పాట్లు చేస్తామ‌న్నారు.జాయింట్ క‌లెక్ట‌ర్‌(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్  కుమార్ సి.ఎం. కార్య‌క్ర‌మం ఏర్పాట్ల‌ను పూర్తిస్థాయిలో ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌నున్నార‌ని, పైలాన్‌, మోడ‌ల్ ఇళ్ల నిర్మాణం బాధ్య‌త‌ల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్‌(అభివృద్ధి) డా.ఆర్‌. మ‌హేష్ కుమార్ ప‌ర్య‌వేక్షిస్తార‌ని, స‌భాస్థ‌లి వ‌ద్ద ఏర్పాట్ల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు ప‌ర్య‌వేక్షిస్తార‌ని తెలిపారు.

 వేదిక ఏర్పాట్ల‌ను డి.ఆర్‌.డి.ఏ. ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ కె.సుబ్బారావు, స‌భ‌కు హాజ‌రైన వారికి సంబంధించిన ఏర్పాట్ల‌ను సాంఘిక సంక్షేమ‌శాఖ డి.డి. సునీల్ రాజ్‌కుమార్ ప‌ర్య‌వేక్షించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

ఈ స‌మావేశంలో ఎం.పి. బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, ఎం.ఎల్‌.సి. పెనుమ‌త్స‌ సురేష్‌బాబు, ఎమ్మెల్యే బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, వైఎస్ఆర్‌సిపి జిల్లా రాజ‌కీయ వ్య‌వ‌హారాల స‌మ‌న్వ‌య క‌ర్త మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, జాయింట్ క‌లెక్ట‌ర్‌లు డా.జి.సి.కిషోర్ కుమార్‌, డా.ఆర్‌.మహేష్‌కుమార్‌,

జె.వెంక‌ట‌రావు, స‌బ్ క‌లెక్ట‌ర్ విదేహ్ ఖ‌రే, డి.ఆర్‌.ఓ. ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌.డి.ఓ. భ‌వానీ శంక‌ర్‌, ఏ.ఎస్‌.పి. శ్రీ‌దేవి రావు, డీఎస్పీ. అనిల్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు. గుంక‌లాం స‌భాస్థ‌లి వ‌ద్ద ఏర్పాట్ల‌ను మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, సీఎం కార్య‌క్ర‌మాల స‌మ‌న్వ‌య‌క‌ర్త త‌ల‌శిల ర‌ఘురాం, ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి త‌దిత‌రులు అధికారుల‌తో క‌లసి ప‌రిశీలించారు.

హెలిపాడ్‌, పైలాన్, మోడ‌ల్ హౌస్ నిర్మాణాలు జ‌రిగే ప్రాంతం, స‌భావేదిక త‌దిత‌ర మూడు చోట్ల సి.ఎం. కార్య‌క్ర‌మాలు వుంటాయ‌ని క‌లెక్ట‌ర్ వివ‌రించారు. పైలాన్ నిర్మాణాన్ని మంత్రి బొత్స త‌దిత‌రులు ప‌రిశీలించారు. స‌భావేదిక నుండి సుమారు రెండు కిలోమీట‌ర్ల దూరంలో హెలిపాడ్ వుంటుంద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.

Related posts

భరత్ తో అసత్యాలు చెప్పిస్తున్నదెవరు?

Satyam NEWS

వైస్ ఎం‌పి‌పి పై చర్యలు తీసుకోవాలి

Murali Krishna

గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారా?

Satyam NEWS

Leave a Comment