21.7 C
Hyderabad
December 2, 2023 04: 21 AM
Slider వరంగల్

రాజయ్య కడియం మధ్య రాజీ

#Rajaiah Kadiam

స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి సీటు ఖరారు చేయడంతో ఆయన హైకమాండ్‌పై పోరుకు రెడీ అయ్యారు. సమయం దొరికిన ప్రతీసారి శ్రీహరిని టార్గెట్‌ చేస్తూ రాజయ్య సెటైర్లు వేశారు. పరోక్షంగా శ్రీహరిని ఓడిస్తా అనే రేంజ్‌ వరకు వెళ్లారు. ఈనేపథ్యంలో తాజాగా ప్రగతి భవన్‌లో రాజయ్య, శ్రీహరితో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు.

ఈ సందర్బంగా జరిగిన భేటీలో రాజయ్య శాంతించారు. వచ్చే ఎన్నికల్లో కడియం గెలుపునకు పార్టీ కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే శ్రీహరికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. అయితే, రాజయ్యకు కేటీఆర్‌ కీలక హామీ ఇచ్చారు. రాజయ్యకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు.

రాజయ్య భవిష్యత్త్‌కు సీఎం కేసీఆర్‌, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక, కేటీఆర్‌ ఇచ్చాన భరోసాతో రాజయ్య మెత్తబడ్డారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కడియం శ్రీహరికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నాని తెలిపారు. బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.

Related posts

ఫతేపూర్ సిక్రీలో కేంద్ర మంత్రి నఖ్వీ ఆధ్వర్యంలో యోగా డే

Satyam NEWS

మోదీ…. పవను భేటీ… మధ్యలో ఫ్యాను ‘‘గాలి’’

Satyam NEWS

ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా టీఆరెస్ పార్టీ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!