28.7 C
Hyderabad
April 26, 2024 08: 28 AM
Slider కరీంనగర్

ఢిల్లీ తరహాలో సిపిఎస్ ను రద్దు చేయాలి

#MujahidHussen

ఉద్యోగులకు శాపంగా మారిన సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలని బిసి,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో జహీర్ అహ్మద్ బేగ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన  సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ముజాహిద్ హుస్సేన్ హజరై మాట్లాడుతూ సిపిఎస్ ఉద్యోగులకు గుదిబండగా మారిందని అన్నారు.

పదవీ విరమణ అనంతరం పెన్షన్ పొందడం ఉద్యోగి హక్కు అయితే 2004 నుంచి ఆ హక్కును పాలకులు హరించారని అన్నారు. పింఛన్ పథకం స్థానంలో  సీపీ ఎస్ ను తీసుకువచ్చి ఉపాధ్యాయ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తీశారని ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్తంగా లక్షా ఇరవై వేలమంది ఉపాధ్యాయ ఉద్యోగులు సిపిఎస్ పరిధిలో ఉండగా ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15 వేల పైచిలుకు ఉపాధ్యాయ ఉద్యోగులు ఉన్నారు.

సిపిఎస్ విధానంలో సి.పి.ఎస్ ఉద్యోగి తన మూల వేతనంలో 10 శాతాన్ని పింఛన్ ఖాతాను చెల్లించాలని కోరారు. ప్రతి నెల ఉద్యోగి యాజమాన్యం చెల్లించిన మొత్తం లో 60% పదవి విరమణ ప్రయోజనం ఇస్తారు 40 శాతాన్ని బీమా సంస్థలు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టుబడి పెడతారు.

దీంతో పదవీ విరమణ తర్వాత ఎంత వస్తుందో కూడా తెలియదు షేర్ మార్కెట్ల ప్రభావం పడుతుంది పెరుగుదల ఉండదు. దురదృష్ట వశాత్తు ఉద్యోగి మరణిస్తే కుటుంబం రోడ్డున పడాల్సి వస్తుందని ఆయన అన్నారు.

పెన్షన్ ఎంత వస్తుందో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. అందుకే నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరారు.

Related posts

ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు:కిషన్ రెడ్డి

Satyam NEWS

తెలంగాణలో వాయిదా పడిన 1-9వ తరగతి పరీక్షలు

Satyam NEWS

పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాలను దిగ్భంధిస్తాం: ఎమ్మెల్యే చిరుమర్తి

Satyam NEWS

Leave a Comment