29.7 C
Hyderabad
April 29, 2024 10: 27 AM
Slider ఖమ్మం

నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి

#dckmm

నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.  పాత కలెక్టరేట్ లో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని సమావేశ మందిరంలో వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. విభాగాల వారిగా సాధించిన ప్రగతిని కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణ చేయాలని తెలిపారు. కంటి విభాగంలో జనవరి మాసంలో 81 మేజర్, 65 మైనర్, 77 ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సలు చేశారని, నెలకు కనీసం 300 శస్త్ర చికిత్సలు చేయాలని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో రెఫర్ చేసిన కాటరాక్ట్ చికిత్సలు షెడ్యుల్ చేసుకొని వెంట వెంటనే పూర్తి చేయాలన్నారు. జనరల్ వైద్య విభాగంలో 24 మేజర్, 22 మైనర్, 16 ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సలు చేశారని, వీటిని పెంచాలని ఆయన తెలిపారు. డెంటల్ విభాగంలో 2 మేజర్, 210 మైనర్ శస్త్ర చికిత్సలు నిర్వహించారని ఆయన అన్నారు. ఆర్థో విభాగంలో 49 మేజర్, 131 మైనర్, 45 ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సలు జనవరి మాసంలో చేశారని ఆయన తెలిపారు. అదే విధంగా యుఎస్జి లు 2665, ఎక్స్ రే లు 3227, సిటీ స్కాన్ 547, ఇసిజి 2029, ల్యాబ్ పరీక్షలు 38,650 లు చేపట్టినట్లు ఆయన అన్నారు. జనవరి మాసంలో ప్రైమి క్రింద సాధారణ ప్రసవాలు 106, సి సెక్షన్ ప్రసవాలు 123, నాన్ ప్రైమీ లు 109 సాధారణ, 234 సి సెక్షన్ ప్రసవాలు చేశారని కలెక్టర్ తెలిపారు. పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి, డాక్టర్లు, వసతులు కల్పించినట్లు, అందుకనుగుణంగా సేవలు కూడా ఉండాలని ఆయన అన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రులకు పేదవారు వస్తారని, వారికి మెరుగైన సేవలు అందించి, ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలని ఆయన అన్నారు.

Related posts

ములుగు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఏఎస్పీ

Sub Editor

గోల్నాక శ్రీశ్రీశ్రీ మైసమ్మ దేవాలయానికి అదనపు సౌకర్యాలు

Satyam NEWS

400 ఎకరాలు కబ్జా చేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

Satyam NEWS

Leave a Comment