40.2 C
Hyderabad
April 29, 2024 18: 08 PM
Slider ప్రత్యేకం

ఆదివాసి మహిళను వివస్త్రను చేసిన అధికారిని సస్పెండ్ చేయాలి

#cpinarayana

మంచిర్యాల జిల్లాలో ఆదివాసి మహిళను వివస్త్రను చేసి, స్టేషన్ తరలించిన రేంజ్ ఆఫీసర్ రత్నాకర్ రావును వెంటనే ప్రభుత్వం సస్పెండ్ చేయాలని  సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ  డిమాండ్ చేశారు. హైదరాబాద్ మగ్ధూంభవన్ సిపిఐ రాష్ట్ర ఇన్ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి,  రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.బాల మల్లేష్, కళవేన శంకర్, గిరిజన తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్ లతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట పంచాయతీ పరిధిలోని కోయపోచగూడం పోడులో ఆదివాసి మహిళలపై అటవీ, పోలీస్ శాఖల దాడులను నారాయణ తీవ్రంగా ఖండించారు. వ్యవసాయం అటవీ ప్రాంతాన్ని అటవీ, పోలీస్ శాఖలు కుమ్మక్కై దౌర్జన్యం చేస్తున్నాయన్నాయని విమర్శించారు. అటవీ, పోలీస్ శాఖలు ఒక్కటై ఆదివాసి మహిళలను వివస్త్రలను చేశారని, ద్రౌపది దుశ్శాన పర్వం మాదిరిగా కళియుగ దుశ్శాసనులుగా వ్యవహరించారని మండిపడ్డారు.

దీనికి కేంద్రప్రభుత్వం మద్దతు ఉన్నదని,  రాష్ట్రం మద్దతు ఉందా? అని ప్రశ్నించారు. ఇక్కడేమో బిజెపి ఒకవైపు టిఆర్ ఒక వైపు కోట్లాడుకుంటారని, మరో వైపు అటవీ, పోలీస్ శాఖలు ఒకటవుతాయని అన్నారు.. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటవుతాయా అని నిలదీశారు. ఒక మహిళ ప్రశ్నిస్తే, ఆమెను తీసుకెళ్లి వివస్త్రను చేస్తారా?, బట్టలు ఊడదీస్తారా? ఇలాంటి దుశ్శాసన, దుర్యోధన పరిపాలనలు సాగిస్తారా? అని మండిపడ్డారు.

గిరిజనులు, పేదలకు అన్యాయం చేసే విషయంలో ఇద్దరు ఒక్కటవుతున్నారని, ఆదివాసీ మహిళను వివస్త్రను చేసిన ఫారెస్ట్ ఆఫీసర్ రత్నాకర్ తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.  కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారిపై కేసులను ఉపసంహరించుకోవాలని, ఆదివాసీలకు  స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకునేవిధంగా అవకాశం కల్పించాలన్నారు.

కార్పొరేట్ సంస్థలకు న్యాయం చేస్తూ, ఆదివాసిలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గౌరవెల్లిలో ఒకవైపు మంత్రి హరీశ్ రావు చర్చలు జరుపుతామంటునే మరోవైపు భూనిర్వాసిత రైతులను అరెస్ట్ చేసి, బేడిలు వేసి తీసుకపోతున్నారని అన్నారు. ఎల్.బి.నగర్ అత్యాచారానికి పాల్పడిన సిఐ నాగేశ్వర్ రాడిసన్ బ్లూ పబ్ డ్రగ్స్ కేసులో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఆ ఘటనలో కూడా అతను దోషే అని ఆరోపించారు. మరో సిఐ విజయ్ కుమార్ భార్య ఉండాలి, ఇంకో మహిళ రెండవ భార్యగా ఉండాలని కోరుకుంటున్నాడని, వీళ్ళు పశువులా మనుషులా అని అన్నారు. 

13న మంచిర్యాల డిఎఫ్ కార్యాలయం ముట్టడిః పల్లా

పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మంచిర్యాలలో జరిగిన పరిస్థితిపై వారం పదిరోజుల క్రితం జిల్లా సిపిఐ నాయకులు పరిస్థితిని పరిశీలించారన్నారు. ఆదివాసిలు గుడిసెలు వేసుకొని, భీష్మించుకొని కుర్చుకున్నారని తెలిపారు. ఫారెస్ట్ అధికారుల దాడులకు నిరసనగా, అమానుషానికి వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లా డిఎఫ్ కార్యాలయాన్ని ఈనెల 13వ తేదీన ముట్టడించాలని జిల్లా పార్టీ నిర్ణయించిందన్నారు.

వెంటనే అక్కడి నుంచి ఫారెస్ట్ అధికారులు వైదొలిగి, అక్కడ సాగు చేసుకుంటున్న రైతులకు రక్షణ కల్పించాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వెంటనే రైతులను సాగులోకి పంపించాలన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఉన్నాయని, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నల్లగొండ కొద్ది ప్రాంతం, ఆసిఫాబాద్ రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరిస్తామని చెప్పుతునే మరోవైపు దాడులు చేస్తున్నారని అన్నారు.

వెంటనే వారికి పట్టాలు ఇవ్వాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో సమస్య పరిష్కరిస్తామని తెలిపారని, వర్షాల కారణంగా రెవెన్యూ సదస్సులు వాయిదా పడ్డాయన్నారు. వెంటనే ప్రభుత్వం పోడు భూముల సమస్యలను పరిష్కరించాలన్నారు. అటవీ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న ఆదివాసిలు, చెంచులు, గిరిజనులు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్య పునరావృతం కాకుండా పట్టాలు ఇవ్వాలన్నారు.

Related posts

వెరైటీ వైరస్: ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా చంపుతున్నది

Satyam NEWS

ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా మోసం చేసింది

Satyam NEWS

ఎలాంటి షరతులు లేకుండా వైసీపీలోకి ముద్రగడ?

Satyam NEWS

Leave a Comment