35.2 C
Hyderabad
May 1, 2024 00: 22 AM
Slider ముఖ్యంశాలు

సైబర్ క్రైమ్స్ నివారించడానికి మరిన్ని పటిష్ట చర్యలు

#nalgonda police

రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలను మరింత సమర్ధవంతంగా అరికట్టడం కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని పటిష్ట చర్యలు చేపడుతున్నామని డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు.

గురువారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు, స్టేషన్ రైటర్లు, సిసిటిఎన్ఎస్ అపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైబర్ క్రైం కేసులను త్వరితగతిన పరిష్కారం చేయడం లక్ష్యంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 2019లో రూపొందించి అమలులోకి తీసుకువచ్చిన ‘నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్’ ద్వారా సైబర్ క్రైం బాధితులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా పిర్యాదు చేయవచ్చని, దీనిపై అవగాహన లేని వారు టోల్ ఫ్రీ నెంబర్ 155260 నెంబర్ కు ఫోన్ చేసి బాధితులు వివరాలు వెల్లడిస్తే నేరుగా పోర్టల్ లో వారు నమోదు చేస్తారని చెప్పారు.

అంతే కాకుండా డయల్ 100 కు ఫోన్ చేసి వివరాలు తెలియజేస్తే పోలీస్ సిబ్బంది వాటిని నమోదు చేసుకొని  ncrp portal లో పిర్యాదు చేయడం జరుగుతుందని వివరించారు. దీని ద్వారా పిర్యాదు నమోదు ఆయిన వెంటనే సంబందిత పోలీస్ స్టేషన్ ద్వారా బ్యాంకుకు సమాచారం ఇవ్వడం ద్వారా సైబర్ క్రైమ్ కు సంబందించిన నగదు బదిలీలను నిలిపి వేయడం ద్వారా బాధితులు నష్టపోకుండా నివారించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ ద్వారా పెద్ద మొత్తంలో కేసుల నమోదుతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు.

ఓటిపిల పేరుతో, ఓఎల్ఎక్స్, ఫేస్ బుక్ నకిలీ ఐడిల రూపంలో, మొబైల్ ఫోన్లకు మెసేజ్ లు పంపి ఆ లింక్ క్లిక్ చేయడం, క్యూఆర్ కోడ్ స్కానింగ్, మల్టీ లెవల్ మార్కెటింగ్స్, ఉద్యోగాల కల్పన పేరుతో జరుగుతున్న మోసాల లాంటి అనేక రకాల సైబర్ నేరాలు జరుగుతున్న క్రమంలో బాధితుల బ్యాంకు ఖాతాలు ఖాళీ కాకుండా నివారించే అవకాశం కలుగుతుందని ఆయన చెప్పారు.

ఇలాంటి నేరాలను నివారించడం లక్ధ్యంగా నేషనల్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ గురించి విస్తృత అవగాహన కల్పించడం కోసం కరపత్రాలు, వాల్ పోస్టర్ల ద్వారా ప్రచారం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని డిఐజి రంగనాధ్ వివరించారు. దీని ద్వారా బాధితులు వెంటనే పిర్యాదు చేయడం ద్వారా బాధితుని బ్యాంకు అకౌంట్ నుండి మరో అకౌంట్ కు నగదు బదిలీ జరగకుండా నివారించవచ్చని ఆయన సూచించారు. ఇలాంటి చర్యల ద్వారా కొంత మేర సైబర్ నేరాలను అదుపు చేయడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు.

డిజిపి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఎంతో కాలంగా ఉన్న వాహనాలు, సీజ్ చేయబడిన  వాహనాలు, వివిధ కేసులలో స్వాధీనం చేసుకున్న వాహనాలను క్లియర్  చేయడంలో అన్ని రకాల నిబంధనలు పాటించాలని సూచించారు. వాహన యజమానులను గుర్తించడం, ఇంజన్ నెంబర్లు, చాసిస్ నెంబర్ల ఆధారంగా ఆర్టీఏ కార్యాలయాల నుండి వాహన యజమానుల నెంబర్లు, చిరునామాను సేకరించి వారం రోజుల వ్యవధిలో మూడు నోటీసులు జారీ చేయాలన్నారు. అదే విధంగా వాహనాలు ఫైనాన్స్ చేయబడిన వాహనాలను గుర్తించి సంబంధిత ఫైనాన్స్ కంపెనీలకు సైతం నోటీసులు జారీ చేయాలని సూచించారు. మొత్తం జిల్లా అంతటా ఒకే రకమైన ఫార్మేట్ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అదే సమయంలో కోర్టు కేసులలో ఉన్న వాహనాలను గుర్తించి వాటిని పక్కన ఉంచాలని డిఐజి రంగనాధ్ తెలిపారు.

శిక్షణ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత

శిక్షణా కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, శిక్షణల ద్వారా కొత్త అంశాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు పనితీరులో నైపుణ్యం పెరుగుతుందని చెప్పారు. ఇకపై జిల్లాలో ప్రతి శనివారం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సిబ్బందికి విధిగా పోలీస్ శాఖలో అమలు చేస్తున్న అన్ని రకాల అంశాలు, సాంకేతిక పరిజ్ఞానం పట్ల మరింత నిష్ణాతులుగా తీర్చిదిద్దడం కోసం ఇకపై ప్రతి శనివారం శిక్షణ నిర్వహించాలని సూచించారు. సైబర్ క్రైమ్స్, నేషనల్ సైబర్ క్రైమ్స్ రిపోర్టింగ్ పోర్టల్ పై స్పష్టమైజ్ అవగాహన కల్పించేలా శిక్షణ ఉండాలని, అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందిని నిష్ణాతులుగా తీర్చిదిద్దే విధంగా శిక్షణ కొనసాగాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో వర్టికల్స్ అమలు తీరును సమీక్షించారు.

సమావేశంలో అదనపు ఎస్పీ నర్మద, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, మొగిలయ్య, సిఐలు రౌతు గోపి, పి.ఎన్.డి. ప్రసాద్, శంకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గౌరు నాయుడు, దుబ్బ అనిల్ కుమార్, రవీందర్, రాజశేఖర్, ఆర్.ఐ.లు నర్సింహా చారి, శ్రీనివాస్, ఎస్.ఐ.లు విజయ్ కుమార్, శివ కుమార్, నాగరాజు, యాదయ్యలతో పాటు స్టేషన్ రైటర్లు, సిసిటిఎన్ఎస్ ఆపరేటర్లు పాల్గొన్నారు.

పెద్ది నరేందర్, సత్యం న్యూస్, నకిరేకల్.

Related posts

పెరిగిన పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలకు వినూత్న రీతిలో నిరసన

Satyam NEWS

బాడీ ట్రెస్డ్:శవమై కనిపించిన సురీల్ దాబావాలా

Satyam NEWS

బిహైండ్ ది క్లౌడ్స్ (Behind the clouds)

Satyam NEWS

Leave a Comment