31.7 C
Hyderabad
May 2, 2024 07: 57 AM
Slider ముఖ్యంశాలు

గ్యాస్ ఏజెన్సీ లపై చర్యలు తీసుకోవాలి

#gas agencies

గ్యాస్ ఏజెన్సీల పై చర్యలు తీసుకోవాలని సతీష్ యాదవ్ కలెక్టర్ ను డిమాండ్ చేశారు. శుక్రవారం వనపర్తి లో ఉన్న మూడు గ్యాస్ ఏజెన్సీల పై అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా ప్రజలతో మమేకమై ఈస్టింగ్ ఆపరేషన్ చేసినట్లు ఆయన తెలిపారు.

వంట గ్యాసు సరఫరాలో గ్యాస్ ఏజెన్సీలు అధిక డెలివరీ చార్జీలతో మహా మోసం చేస్తున్నాయని ఆరోపించారు.కేంద్రం వేసిన అధిక ధరల బరువుతో పాటు ఆటో, డోర్ డెలివరీ చార్జీలతో లౌక్యమైన మోసం భారీగా జరుగుతుందని అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని పైగా కమిషన్లతో పట్టించుకోకుండా ప్రజలపై అధిక భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పెద్ద హోటల్ లకు డొమెస్టిక్ సిలిండర్లు పేరుతో లక్షల్లో ముడుపులు తీసుకుంటున్నారని ఇట్టి అవినీతిని అరికట్టాలని అధికారులను అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తుందని అన తెలిపారు.

ఈరోజు వనపర్తి లో ఉన్న మూడు ఏజెన్సీలకు వెళ్లి అవినీతిని బట్ట బయలు చేసిందని ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు.వనపర్తి లో ఉన్న వంటగ్యాస్ ఏజెన్సీలలో ఒకటి 12000 కనెక్షన్లు, రెండవది 22000 కనెక్షన్లు, మూడవది 35 వేల కనెక్షన్లు కలిగిన వంట గ్యాస్ ఏజెన్సీలు ప్రతినిత్యం ఆటోలో ప్రజలకు చేరవేస్తున్నాయి.

కాగా కేంద్రం ఇచ్చిన రేటు ప్రకారం 1165 రూపాయలు ఉంటే దానికి అదనంగా 40 రూపాయలు నుండి 50 రూపాయలు వరకు ఆటో చార్జి డెలివరీ చార్జి అని ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని,దీనివలన నెలకు 65000 x నలభై రూపాయలు అంటే దాదాపు 26 లక్షలు ప్రజల నుండి అధికంగా దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రం నిర్ణఇంచిన సిలిండర్ ధర 1165 రూపాయలలో అన్ని చార్జీలు కలుపుకొని ఉండగా ప్రజలకు అది తెలియకుండా గ్యాస్ ఏజెన్సీలు ఆటోలకు కమిషన్లు కిరాయి ఇవ్వకుండా తామే దండుకుంటూ అధికారులకు అమ్యామ్యాలు ఇస్తూ, ఆటో వారితో అధికంగా వసూలు చేపిస్తూ మోసం చేస్తున్నా రన్నారు.

జిల్లా కలెక్టర్ ను ఈ ఏజెన్సీ లపై తగు చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకొని బాధ్యతగల అధికారులపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జానంపేట రాములు, రమేష్, బొడ్డుపల్లి సతీష్, మెంటేపల్లి రాములు, సుదర్శన్ రెడ్డి, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రతిభ చూపిన విద్యార్ధులకు పోలీసుల సన్మానం

Satyam NEWS

రైతులను విస్మరిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వం

Satyam NEWS

ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 బీసీలకే

Bhavani

Leave a Comment