40.2 C
Hyderabad
April 26, 2024 12: 25 PM
Slider మెదక్

రైతులను విస్మరిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వం

#harishrao

మెదక్ జిల్లా ప్రజాపరిషత్ ఛైర్ పర్సన్ హేమలత అధ్యక్షతన కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరిశ్ రావ్ హాజరయ్యారు. ఆయనతో బాటు ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిశ్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడాన్ని హర్షిస్తూ తీర్మానం చేసి పార్లమెంట్ కు అంబేద్కర్ పెరు పెట్టాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్ ఆసరా పెన్షన్ల ను 57 ఏండ్లకు కుదించి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడాన్ని జడ్పిటిసి స్వాగతిస్తూ తీర్మానం చేసింది ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కేంద్రం రైతు వ్యతిరేక ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో రైతులను విస్మరిస్తున్నదని అయితే సీఎం కేసీఆర్ దైర్యంగా వడ్లు కొన్నారని అన్నారు. వాస్తవాలను ప్రజలముందు ఉంచాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని మంత్రి అన్నారు.

రైతుబిమా కింద 205 కోట్ల రూపాయలు చనిపోయిన రైతు కుటుంబాలకు అందించామని హరీష్ రావు గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ కు ఉన్న సంకల్పంతో రైతులకు ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతున్నారని ఆయన అన్నారు. అందుకే 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు తెలంగాణ లో పండుతున్నాయని ఆయన అన్నారు. దేశంలోనే ఎక్కువ పంటలు పండుతున్న ఏకైనా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని మంత్రి హరీష్ రావు తెలిపారు.

Related posts

నన్ పై అత్యాచారం కేసులో బిషప్ నిర్దోషి

Satyam NEWS

దిశ హత్య దేశంలో ప్రతి ఒక్కరికీ బాధ కలిగించింది

Satyam NEWS

అంకితభావంతో పని చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది

Satyam NEWS

Leave a Comment