27.7 C
Hyderabad
April 30, 2024 08: 48 AM
Slider ఖమ్మం

వైస్ ఎం‌పి‌పి పై చర్యలు తీసుకోవాలి

#dyfi

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం చిమ్మపుడి గ్రామంలో అనేక రకాల ప్రజా సమస్యలపై, విద్యార్థుల, యువకుల సమస్యపై పోరాడుతున్న డివైయఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్ పై మండల వైస్ యంపిపి గుత్తా రవి చెప్పుతో దాడి చేశాడని వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి గ్రామంలో ప్రశాంత వాతావరణంకి కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్ర.శ్రీకాంత్,కాంగ్రెస్ మండల నాయకుడు మారం.కరుణాకర్ రెడ్డి, సీపీఐ మండల నాయకులు జూల.వెంకటేశ్వర్లు, సీపీఎం మండల కార్యదర్శి యస్.నవీన్ రెడ్డి లు డిమాండ్ చేశారు. దీనిపై స్థానిక రఘునాదపాలెం మండల పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. అనంతరం రమేష్ స్వగ్రామం చిమ్మపుడి గ్రామంలో  సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్ర.శ్రీకాంత్, సీపీఎం,సీపీఐ, కాంగ్రెస్ అఖిలపక్ష పార్టీల నాయకులు రమేష్ ని పరామర్శించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామం శివారులో ప్రభుత్వ భూమి ఉందని, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని  అఖిలపక్ష పార్టీల నాయకులతో పాటు చింతల రమేష్ పోయాడని నేపంతో, గ్రామంలో విద్యార్థులు, యువకుల ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూ పోరాడుతున్నాడని, దానిని జీర్ణించుకోలేక ఇలా భౌతిక దాడులకు పాల్పడటం పిరికిపందా చర్య అన్ని, సమస్యలపై ప్రశ్నిస్తే చెప్పుతో ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉన్న వైస్ యం. పి.పి ఇలా ప్రశించే వారిని అహంకారంతో భూతులు తిడుతూ చెప్పుతో దాడి చేయడాని ప్రజాస్వామ్య వాదులందరు తీవ్రంగా ఖండించాలని వారు తెలిపారు. రవి పై కేసు నమోదు చేసి,ప్రభుత్వ భూముని స్వాధీనం చేసుకొవాలని, గ్రామంలో ప్రశాంత వాతావరణం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

Related posts

విజయదశమి రోజున కొత్త సచివాలయ నిర్మాణం ప్రారంభం

Satyam NEWS

30 ఏళ్ల‌కు పీపీఏలా.. సీపీఐ కె. రామ‌కృష్ణ

Sub Editor

కరోనా ఎఫెక్ట్: పాకిస్తాన్ రాజధానిలో మళ్లీ లాక్ డౌన్ విధింపు

Satyam NEWS

Leave a Comment